News October 14, 2024

కొత్తగూడెం: తండ్రిని హత్యచేసిన తనయుడు

image

మద్యానికి బానిసైనా కొడుకు తండ్రిని హతమార్చిన ఘటన దమ్మపేట మండలం వడ్లగూడెంలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. కృష్ణయ్య(70), భార్య మంగమ్మ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి కొడుడు సత్యనారాయణ మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం మద్యం కోసం కృష్ణయ్య వద్ద డబ్బులు అడగటంతో గొడవ మొదలైంది. కోపోద్రిక్తుడైన కొడుకు తన తండ్రి మెడను కత్తితో కోశాడు. కృష్ణయ్యను ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

Similar News

News January 9, 2026

యూరియా కోసం రైతుల పాట్లు.. అధికారుల ప్రకటనలకే పరిమితం!

image

ఖమ్మం జిల్లాలో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. సరిపడా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ అనుదీప్ చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఎరువుల కోసం రైతులు కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. అధికారుల సమన్వయ లోపంతో పంట పనులు వదులుకుని పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరఫరాలో నిర్లక్ష్యం వీడి, తక్షణమే యూరియా అందుబాటులోకి తీసుకురావాలని అన్నదాతలు కోరుతున్నారు.

News January 9, 2026

మున్సిపల్ పోరు.. అందరి దృష్టి మంత్రి పొంగులేటి ఇలాఖాపైనే..!

image

ఏడు పంచాయతీల విలీనంతో 20 వార్డులు, 18,868 మంది ఓటర్లతో కల్లూరు మున్సిపాలిటీగా అవతరించింది. ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత మండలం కావడంతో ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. రేపు ఫైనల్ ఓటర్ల జాబితా విడుదల కానుండటంతో అభ్యర్థుల వేట మొదలైంది. భవిష్యత్‌లో కల్లూరు అసెంబ్లీ నియోజకవర్గంగా మారుతుందనే ప్రచారం జరుగుతుండటంతో, ఇక్కడ పట్టు సాధించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాల్లో మునిగిపోయాయి.

News January 9, 2026

46 మంది ఉపాధ్యాయుల సర్దుబాటు: డీఈవో

image

ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు ఆటంకం కలగకుండా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ, సెలవుల వల్ల ఏర్పడిన ఖాళీల్లో 46 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ డీఈవో చైతన్యజైనీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్, డిసెంబర్ నెలల ఖాళీలతో పాటు సెక్టోరల్ విభాగాల్లోని ఏఎంవో, జీసీడీవో స్థానాల్లోనూ నియామకాలు చేపట్టారు.