News October 14, 2024
కాళేశ్వరంపై విచారణ.. 21న రాష్ట్రానికి న్యాయ కమిషన్!

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, నష్టాలపై విచారణను అర్ధంతరంగా ముగించిన న్యాయ కమిషన్ ఈనెల 21న మరోసారి రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై అఫిడవిట్లు సమర్పించిన వారిని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారించే అవకాశం ఉంది. IASలు, విశ్రాంత IASలతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
Similar News
News November 21, 2025
అమల్లోకి కొత్త లేబర్ కోడ్స్

కార్మికులకు భరోసా కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్‌లు నేడు అమల్లోకి వచ్చాయి. వీటిలో కోడ్ ఆన్ వేజెస్(2019), ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్(2020), కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ(2020), ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్(2020) ఉన్నాయి. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీటిని తీసుకొచ్చింది.
News November 21, 2025
పొలంలో ఎలుకల నిర్మూలనకు ముందు ఏం చేయాలి?

వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులు, చీడపీడల తర్వాత ఎలుకలు చేసే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. పొలాల్లోని కలుగుల్లో ఉండే ఎలుకలను పొగబెట్టడం, రసాయన ఎరలు, ఎర స్థావరాల ఏర్పాటుతో నివారించవచ్చు. అయితే ఎలుక కన్నాల సంఖ్యను బట్టి నివారణా చర్యలు చేపట్టాలి. దీనికి ముందు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే పొలం గట్లమీద ఉండే పొదలను తొలగించాలి. గట్లను పారతో చెక్కి తర్వాత ఎలుకల నిర్మూలన చర్యలు చేపట్టాలి.
News November 21, 2025
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 4 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MA (ELS/ELT/ఇంగ్లిష్), PhD, M.Phil ఉత్తీర్ణతతో పాటు NET అర్హత సాధించి ఉండాలి. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 26వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://uohyd.ac.in/


