News October 14, 2024
న్యూ లిక్కర్ పాలసీ.. ప్రారంభంలోనే రూ.2400 కోట్ల ఆదాయం

AP: మద్యం షాపులకు ఇవాళ జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. షాపు దక్కించుకున్న వారు చెల్లించే తొలి విడత లైసెన్స్ రుసుముతో సుమారు రూ.300 కోట్ల ఆదాయం లభిస్తుంది. అలాగే వారం రోజులు సరకు కొనుగోలు ద్వారా మరో రూ.300 కోట్లకు పైగా వస్తుంది. ఇప్పటికే ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ.1797.64 కోట్ల ఆదాయం లభించింది. మొత్తంగా నూతన పాలసీ ప్రారంభంలోనే రూ.2400 కోట్ల ఆదాయం సమకూరుతుంది.
Similar News
News November 9, 2025
మామిడిలో ఆకుతినే పురుగు నివారణకు సూచనలు

మామిడిని ఆకుతినే పురుగు ఆశించి పంటకు నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు అజాడిరక్టిన్(3000 పి.పి.ఎం.) 300 మి.లీ.లతోపాటు ఎసిఫేట్ 75% ఎస్.పి. 150 గ్రా. లేదా క్వినాల్‌ఫాస్ 25% ఇ.సి. 200ml లేదా ప్రొఫెనోఫోస్ 50% ఇ.సి. 200ml లలో ఏదైనా ఒక దానిని 100 లీటర్ల నీటికి కలిపి చెట్టు పూర్తిగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. అలాగే మామిడి తోటలో కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి.
News November 9, 2025
విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం.. ముందే చెప్పామన్న ATC

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 2 రోజుల క్రితం తలెత్తిన తీవ్ర సాంకేతిక సమస్య గురించి తాము కొన్ని నెలల ముందే గుర్తించి చెప్పామని ATC పేర్కొంది. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎయిర్ నావిగేషన్ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేయాలని AAIకి లేఖ రాసినట్లు వెల్లడించింది. కానీ తమ సూచనలను పట్టించుకోలేదంది. ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్టుల్లో ATC వ్యవస్థ కుప్పకూలి 800కు పైగా విమానాలపై ప్రభావం చూపింది.
News November 9, 2025
APPLY NOW: NPCILలో 122 పోస్టులు

ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL)లో 122 Dy మేనేజర్, Jr ట్రాన్స్‌లేటర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ, PG, MBA, ఇంజినీరింగ్ డిగ్రీ, LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు NOV 27 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. వెబ్‌సైట్: https://npcilcareers.co.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.


