News October 14, 2024
కడపలో ప్రారంభమైన మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ

నూతన మద్యం పాలసీకి సంబంధించి కడప నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో లాటరీ ద్వారా దుకాణాల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ శివ శంకర్, జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ సమక్షంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఒక్కో దుకాణానికి లాటరీ పద్ధతిలో లైసెన్స్ కేటాయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 139 మద్యం దుకాణాలకు సంబంధించి మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది.
Similar News
News September 15, 2025
కడప ఎంపీ.. హాజరులో చివరి స్థానం

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హాజరులో 54.41 శాతంతో చివరి స్థానంలో ఉన్నారు. 80 ప్రశ్నలను సభలో అడిగగా.. 5 చర్చల్లో మాత్రమే ఆయన పాల్గొన్నారు.
News September 15, 2025
కడప: తండ్రి కోసం ఐపీఎస్ అయ్యాడు.!

తన తండ్రి కలను తీర్చడానికి కష్టపడ్డ వ్యక్తి కడప జిల్లా నూతన SP నచికేత్ షలేకే. ఈయన పూణేలోని ప్రింళై గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు విశ్వనాథ్, చంద్రసేన ఇద్దరూ ఉపాధ్యాయులే. తాను ఐపీఎస్ కావడం తన తండ్రి కల అని, దాని కోసం చాలా కష్టపడ్డానని ఓ ఇంటర్వూలో ఆయన పేర్కొన్నారు. రెండు సార్లు విఫలం చెంది 2019లో మూడో ప్రయత్నంలో సివిల్స్‌లో సెలెక్ట్ అయ్యారు. ఇవాళ 10 గంటలకు కడప ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
News September 15, 2025
కడప జిల్లాలో 46 మంది పోలీస్ సిబ్బంది బదిలీ.!

కడప జిల్లాలో 46 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తూ ఎస్పీ అశోక్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 39 మందికి స్థాన చలనం కలిగించారు. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు బదిలీ చేశారు. మరో ఏడుగురికి అటాచ్మెంట్ ఇచ్చారు. పరిపాలనా సౌలభ్యం కోసం బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా శనివారం ఎస్పీతోపాటు పలు జిల్లాల ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది.