News October 14, 2024

హ్యాపీ బర్త్ డే లెజెండ్: ఢిల్లీ క్యాపిటల్స్

image

టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ బర్త్ డే సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ స్పెషల్ విషెస్ తెలిపింది. ‘తన పనిపట్ల ఎంతో కమిటెడ్‌గా ఉంటారు. పేరుకు తగ్గట్లు అంత గంభీరంగా ఉండరు. కానీ, చాలా అగ్రెసివ్, బెస్ట్ టీచర్’ అని తెలుపుతూ ఓ ఫొటోను పోస్ట్ చేసింది. పైన తెలిపిన వాటిలో పట్టు సాధించిన లెజెండ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్‌లో రాసుకొచ్చింది. గంభీర్ ఇన్నింగ్స్‌లో మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయండి.

Similar News

News January 15, 2026

మున్సిపల్ ఎన్నికలు.. రిజర్వేషన్లు ఖరారు

image

TG: మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసింది. 121 మున్సిపాలిటీల్లో జనరల్ 30, జనరల్ మహిళ 31, బీసీ జనరల్ 19, బీసీ మహిళ 19, ఎస్సీ జనరల్ 9, SC మహిళ 8, ఎస్టీ జనరల్ 3, ST మహిళలకు 2 స్థానాలు కేటాయించింది. 10 కార్పొరేషన్లలో జనరల్ 1, జనరల్ మహిళ 4, బీసీ జనరల్ 2, బీసీ మహిళ 1, ఎస్సీ 1, ఎస్టీకి ఒక స్థానంలో కేటాయింపులు చేసింది. ఈ నెల 17లోపు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముంది.

News January 15, 2026

భారత్ ఓటమి.. వీటికి సమాధానమేది?

image

న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో టీమ్ ఇండియా ఓటమితో పలు ప్రశ్నలు వస్తున్నాయి. ‘ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని జడేజా తర్వాత ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం ఎంత వరకు కరెక్ట్? బుమ్రాకు రెస్ట్ ఉన్న సమయంలో స్టార్ బౌలర్‌గా పేరున్న అర్షదీప్ సింగ్‌ను బెంచ్ పరిమితం చేయడమేంటి? పదే పదే జడేజాను నమ్ముకోకుండా ప్రత్నామ్నాయంపై దృష్టి పెట్టాలి’ అని క్రీడా నిపుణులు సూచిస్తున్నారు. మీరేమంటారు?

News January 14, 2026

‘నారీనారీ నడుమ మురారి’ రివ్యూ&రేటింగ్

image

పెళ్లి చేసుకునే సమయంలో మాజీ ప్రేయసి ఎంట్రీతో ఎదురైన పరిస్థితులను హీరో ఎలా పరిష్కరించుకున్నాడనేదే స్టోరీ. శర్వానంద్, సంయుక్త, సాక్షి నటనతో మెప్పించారు. సత్య, నరేశ్, వెన్నెల కిశోర్ కామెడీ అదిరిపోయింది. హీరో శ్రీవిష్ణు క్యామియో సినిమాకు ప్లస్. క్లైమాక్స్ డిఫరెంట్‌గా ఉంది. మ్యూజిక్ యావరేజ్. కొన్ని సీన్లు రిపీట్ అనిపిస్తాయి. ఫన్, ఎమోషన్లతో ఫ్యామిలీ ప్రేక్షకులను అలరిస్తుంది.
Way2News రేటింగ్: 3/5