News October 14, 2024

మల్కాజిగిరి రైల్వే స్టేషన్‌కు కొత్త రూపురేఖలు

image

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ABSS)లో భాగంగా చేపట్టిన మల్కాజిగిరి రైల్వే స్టేషన్ పునరభివృద్ధి శరవేగంగా సాగుతోంది. వచ్చే ఆరు నెలల్లో పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. భారతీయ రైల్వే ద్వారా పునరుద్ధరణ, పునరాభివృద్ధి కోసం భారతదేశం అంతటా 1,275 స్టేషన్లు షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయి. అందులో మల్కాజిగిరి రైల్వేస్టేషన్‌ను ఎంపిక చేసి అభివృద్ధి పనులకు రూ.27 కోట్లు కేటాయించారు.

Similar News

News December 8, 2025

ఇక తెలంగాణ ‘ఫ్యూచర్’ మన HYD

image

నేటి నుంచే కందుకూరులో గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఇది ప్రపంచ ఆర్థిక సదస్సు ‘దావోస్’‌గా కార్యరూపం దాల్చింది. ఈ ఫ్యూచర్ సిటీలో భారీ పెట్టుబడులను ఆకర్షించి, యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా సంపన్నులను ఆహ్వానించింది. ఇప్పటికే బ్లాక్ క్యాట్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్‌ అక్కడ పహారా కాస్తున్నాయి. ఈ సమ్మిట్‌తో ‘నిన్నటి వరకు ఒక లెక్క నేటి నుంచి మరో లెక్క’ అని సీఎం ధీమా వ్యక్తంచేశారు.

News December 8, 2025

HYD: గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం

image

ఫ్యూచర్ సిటీలో నేడు, రేపు నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం చేశారు. ఈ సమ్మిట్‌కు దేశ విదేశాలకు చెందిన పెట్టుబడుదారులు, పారిశ్రామిక వేత్తలు, ఐటీ కంపెనీల సీఈవోలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరు కాబోతున్నారు. 8వ తేది మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సమ్మిట్‌ను ప్రారంభించనున్నారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు సమ్మిట్ ముగియనుంది.