News October 14, 2024

27వ వసంతంలోకి ద్రావిడ విశ్వవిద్యాలయం

image

కుప్పంలోని ద్రావిడ ద్రావిడ వర్సిటీ 27వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఈనెల 20వ తేదీన వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం జరపనున్నట్లు రిజిస్ట్రార్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ వేడుకలకు చిత్తూరు ఎంపీ డి.ప్రసాద్ రావు, ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం, కలెక్టర్ సుమిత్ కుమార్, కడా పీడీ వికాస్ మర్మత్ హాజరవుతారని చెప్పారు.

Similar News

News December 28, 2024

CA ఫలితాల్లో ‘టాప్‘ లేపిన చిత్తూరు జిల్లా కుర్రాడు

image

జాతీయ స్థాయిలో జరిగిన చార్టెర్డ్ అకౌంటెంట్(CA) తుది ఫలితాల్లో చిత్తూరు జిల్లా వాసి అగ్రస్థానం కౌవసం చేసుకున్నాడు. తాజాగా వెలవడిన ఫలితాల్లో పలమనేరుకు చెందిన రిషబ్ ఓత్సవాల్ 600 మార్కులకు గాను 508 మార్కులు సాధించి మరో విద్యార్థితో సమానంగా నిలిచాడు. దీంతో ఇన్‌స్టి‌ట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండిమా(ICIA) ఇద్దరికి ప్రథమ స్థానం కేటాయించింది. వారికి పలువురు అభినందనలు తెలిపారు.

News December 28, 2024

చిత్తూరు: 30 నుంచి దేహదారుడ్య పరీక్షలు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలకు ఉత్తీర్ణులైన వారికి డిసెంబర్ 30 నుంచి జనవరి 10 వరకు దేహదారుడ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు ఎస్పీ మణికంఠ తెలిపారు. 990 మంది మహిళలు, 4248 మంది పురుషులు జిల్లా పోలీస్ ట్రైనింగ్ కేంద్రంలో పరీక్షలకు హాజరుకావాలన్నారు. ఈ మేరకు సిబ్బందికి పోలీసు గెస్ట్ హౌస్ సమావేశ మందిరంలో అవగాహన కల్పించారు.

News December 28, 2024

తిరుపతి: విద్యార్థిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్ అరెస్ట్

image

తిరుపతి వెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని లైంగికంగా వేధించిన ప్రొ.ఉమామహేశ్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురానికి చెందిన విద్యార్థి వర్సిటీలో మొదటి సం.చదువుతోంది. ఆమె తరగతి గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రొ. లైంగింకంగా వేధించాడు. బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ సీఐ చిన్న గోవిందు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.