News October 14, 2024

అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

image

ఈ ఏడాది అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురిని వరించింది. డారెన్ ఏస్ మోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఎ.రాబిన్‌సన్ ఈ పురస్కారానికి ఎంపికైనట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. సంస్థల ఏర్పాటు, దేశాల మధ్య సంపదలో అసమానతలపై చేసిన అధ్యయనానికి గానూ వీరికి పురస్కారం దక్కిందని తెలిపింది.

Similar News

News November 9, 2025

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ(<>NIH<<>>) 3 ప్రాజెక్ట్ సైంటిస్ట్, SRF, JRF పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు ఈనెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. పీజీ, పీహెచ్‌డీ, ఎంఈ, ఎంటెక్/హైడ్రాలజీ/అగ్రికల్చర్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణతతో పాటు నెట్ అర్హత సాధించి ఉండాలి. వెబ్‌సైట్: https://nihroorkee.gov.in

News November 9, 2025

లైట్‌హౌస్‌ పేరెంటింగ్ గురించి తెలుసా?

image

పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులు రకరకాల పద్దతుల ఉపయోగిస్తారు. వాటిలో ఒకటే లైట్‌హౌస్‌ పేరెంటింగ్. ఈ పద్ధతిలో పిల్లలు జీవితంలో అన్నిట్లో రాణించాలని పేరెంట్స్ అనుకుంటారు. ఆరోగ్యం, ఆనందం, విజయం వైపు వెళ్లడానికి వారికి మద్దతుగా నిలుస్తారు. ఇది పిల్లలు నేర్చుకోవడానికి, సానుకూలంగా ఎదగడానికి సాయపడుతుంది. పిల్లలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ వారికి తోడుగా ఉంటారు. దీన్నే డాల్ఫిన్ పేరెంటింగ్‌ అని కూడా అంటారు.

News November 9, 2025

హిందువులు మీతో లేరని ఒప్పుకుంటారా?: రేవంత్

image

TG: జూబ్లీహిల్స్‌ ప్రజల్లో 80% హిందువులు BJP వైపు ఉన్నారన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై CM రేవంత్ సెటైర్లు వేశారు. ‘ఈ ఎన్నికల్లో BJP డిపాజిట్ పోతుంది. రాసిపెట్టుకోండి. మీరు ఓడిపోతే హిందువులు మీతో లేరు అని భావించాలి’ అని ఛాలెంజ్ విసిరారు. BRS గెలుపు కోసం జూబ్లీహిల్స్‌లో BJP పనిచేస్తోందన్నారు. BRS విలీనమైతే వచ్చే లాభంపై ఇక్కడ రెండు పార్టీలు లిట్మస్ టెస్ట్ చేసుకుంటున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.