News October 14, 2024
రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది : హోం మత్రి

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడడం జరిగిందన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు. తుఫాన్ షెల్టర్లను సిద్ధం చేసామన్నారు. ప్రతి మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Similar News
News September 20, 2025
విశాఖలో ఈ గవర్నెన్స్ సదస్సుపై సమీక్ష

విశాఖలో ఈ నెల 22,23న జరిగే ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సుపై ఐటి విభాగం కార్యదర్శి కాటమనేని భాస్కర్ శనివారం సమీక్షించారు. రెండు రోజుల సదస్సుకు వెయ్యి మంది ప్రతినిధులు వస్తారన్నారు. కొందరు పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉందన్నారు. దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. సదస్సు జరగనున్న హోటల్ వద్ద వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు.
News September 20, 2025
విశాఖలో నాలుగు కొత్త రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్

విశాఖ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు 4 కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. విశాఖ-గోపాలపట్నం, దువ్వాడ-ఉత్తర సింహాచలం, వడ్లపూడి-గేట్ కేబిన్ జంక్షన్ మార్గాల్లో కొత్త లైన్లు రానున్నాయి. పెందుర్తి-ఉత్తర సింహాచలం మధ్య పైవంతెన నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రయాణికులు, గూడ్స్ రైళ్ల ఆలస్యం తగ్గి, రన్నింగ్ టైమ్ కుదించడంతో పాటు వేగం పెరుగుతుందని అధికారులు తెలిపారు.
News September 20, 2025
ఏయూలో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో MA, Mcom, MSC కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సంచాలకుడు డి.ఏ.నాయుడు తెలిపారు. ఈనెల 24 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, 26వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. ఏపీ పీజీ సెట్‌లో ర్యాంక్ సాధించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫీజులు, కోర్సులు, తదితర వివరాలను వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.