News October 14, 2024
రేపటి నుంచి మళ్లీ ‘మూసీ’ కూల్చివేతలు.. ఇళ్ల ముందు బోర్డులు

TG: మూసీ నది పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలను మంగళవారం నుంచి పునఃప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మూసీ రివర్ బెడ్‌పై 2,116 ఇళ్లు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. కాగా కూల్చివేతల పున:ప్రారంభం నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లోని 100మందికి పైగా ఇళ్ల యజమానులు తమ ఇళ్లకు ఫ్లెక్సీలు వేలాడదీశారు. తమ ఇళ్లను కూల్చివేయవద్దని హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందని అందులో పేర్కొన్నారు.
Similar News
News November 11, 2025
UGC-NET దరఖాస్తులో తప్పుల సవరణకు అవకాశం

అసిస్టెంట్ ప్రొఫెసర్, JRFకోసం నిర్వహించే UGC-NET డిసెంబర్ 2025 దరఖాస్తులో తప్పుల సవరణకు NTA అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నవంబర్ 12న సవరణ చేసుకోవచ్చని ప్రకటించింది. అభ్యర్థుల పేరు, జెండర్, ఫొటో, సంతకం, మొబైల్ నంబర్, ఈ- మెయిల్, అడ్రస్, పరీక్ష సిటీ మార్చుకోవచ్చు. పరీక్షలు డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు రోజుకు రెండు సెషన్లలో జరగనున్నాయి.
News November 11, 2025
పద్మాసనంలో దర్శనమిచ్చే ఆంజనేయుడు

కర్ణాటక హంపిలో ఉన్న యంత్రోద్ధారక హనుమాన్ ఆలయం చాలా ప్రత్యేకం. ఇక్కడ ఆంజనేయుడు నిలబడే రూపంలో కాకుండా, పద్మాసనంలో కూర్చుని దర్శనమిస్తాడు. విజయనగర సామ్రాజ్య రాజగురువు అయిన వ్యాసరాజ తీర్థులు ఈ ఆలయాన్ని స్థాపించారు. ఈ స్వామి చుట్టూ ఓ పవిత్రమైన యంత్రం కూడా ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన రేఖాచిత్రం అని నమ్ముతారు. ఈ రూపం హనుమంతుని ధ్యాన శక్తి, జ్ఞానం, స్థిరమైన భక్తికి ప్రతీకగా పూజలందుకుంటోంది. <<-se>>#Temple<<>>
News November 11, 2025
ఢిల్లీలో ఆత్మాహుతి దాడి? కారులో ఉన్నది అతడేనా?

ఢిల్లీ పేలుడు ఆత్మాహుతి దాడేమోనని ఇన్వెస్టిగేషన్ సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. పుల్వామాకు చెందిన సల్మాన్ నుంచి డా.ఉమర్ మహ్మద్ i20 కారు తీసుకున్నట్లు భావిస్తున్నాయి. బ్లాస్ట్‌కు ముందు కారులో బ్లాక్ మాస్క్‌తో ఉన్నది ఉమరేనా అనే కోణంలో విచారణ చేపట్టాయి. ప్లాన్ ప్రకారమే అతడు కారులో పేలుడు పదార్థాలతో వచ్చి ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడా? అని ఆరా తీస్తున్నాయి.


