News October 14, 2024
16న విశాఖలో జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

విశాఖ జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో నారాయణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఒకటి నుంచి ఏడు వరకు గల స్థాయిూ సంఘ సమావేశాలు వేరువేరుగా ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరుగుతాయన్నారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు సమావేశానికి హాజరు కావాలని కోరారు.
Similar News
News January 19, 2026
విశాఖ: టీడీపీలో వర్గ విభేదాలు బహిర్గతం

జీవీఎంసీ 86వ వార్డు TDPలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. NTR వర్ధంతి సందర్భంగా కూర్మన్నపాలెం కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు ఒక వర్గంగా, వార్డు అధ్యక్షుడు నల్లూరి సూర్యనారాయణ మరో వర్గంగా విడిపోయి పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మద్దతుతో వార్డు అధ్యక్షుడు తన పట్టును పెంచుకుంటున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
News January 19, 2026
విశాఖ వ్యాలీ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

విశాఖ వ్యాలీ జంక్షన్ దగ్గర సిగ్నల్ పాయింట్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 19, 2026
నేటి నుంచి ఏయూలో తరగతులు పున:ప్రారంభం

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నేటి నుంచి తరగతులు పున:ప్రారంభం కానున్నాయి. క్రిస్మస్, సంక్రాంతి సెలవుల నేపథ్యంలో దాదాపు నెల రోజులపాటు విద్యార్థులకు సెలవులను ఇచ్చారు. పండుగ సెలవుల అనంతరం ఈరోజు నుంచి పూర్తిస్థాయిలో విశ్వవిద్యాలయంలో తరగతులు ప్రారంభం అవుతున్నాయి. ఐదు రోజులుగా బోధనేతర సిబ్బందికి సైతం పండగ సెలవులు లభించాయి దీంతో విశ్వవిద్యాలయం బోసిపోయింది. నేటి నుంచి పూర్తిస్థాయిలో వర్సిటీ పనిచేస్తుంది.


