News October 14, 2024

కడప: డిగ్రీ ఒకేషనల్ పరీక్షలు వాయిదా

image

యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలో ఈనెల 15వ తేదీ నుంచి జరగాల్సిన డిగ్రీ ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ప్రభావం అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలపై ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. కృష్ణారెడ్డి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

Similar News

News March 11, 2026

కడప జిల్లా: ఒక్కరోజులో 274 కేసులు.!

image

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కడప ఎస్పీ షెల్కే నచికేత్ హెచ్చరించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కారు ప్రయాణికులు సీట్ బెల్ట్ తప్పక ధరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం చేపట్టిన తనిఖీల్లో నిబంధనలు మీరిన వారిపై 274 కేసులు నమోదు చేసి రూ.56,615 జరిమానా విధించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై కూడా కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

News March 11, 2026

కడప: రైతు కష్టం.. AMCలకు ఆదాయం పంట..!

image

రైతులు కష్టపడి పండించిన వ్యవసాయ ఉత్పత్తులపై కడప జిల్లా AMCలకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవని నాటికి రూ.11.78 కోట్లు లభించింది. పంటల వారీగా AMCలకు లభించిన ఆదాయం రూ.లక్షల్లో ఇలా. వరి-194, బియ్యం-52, వేరుశనగ-43, ప్రొద్దుతిరుగుడు-3, పత్తి-117, ఉల్లి-17, పప్పుశనగ-86, కందులు-3, బత్తాయి-14,, పసుపు-99, మినుములు-98, నువ్వులు-,96, మొక్కజొన్న-62, జొన్న-16, పప్పుదినుసులు-12, అరటి-21, ఇతర పంటలు-239 లక్షలు.

News March 11, 2026

నిబంధనలు పాటించని వారిపై 274 కేసులు నమోదు: కడప ఎస్పీ