News October 14, 2024
గ్రూప్-1పై రేపు హైకోర్టు తీర్పు

TG: గ్రూప్-1 పరీక్షలకు సంబంధించి హైకోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది. ప్రిలిమ్స్ ఫైనల్ కీలలో తప్పులున్నాయని అభ్యర్థులు వాదించారు. తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని, వికీపీడియా, గూగుల్ ఆధారంగా కీ రూపొందించినట్లు TGPSC కోర్టులో వివరణ ఇచ్చింది. దీంతో పాటు ST రిజర్వేషన్లకు సంబంధించి జీవో-33పై దాఖలైన పిటిషన్‌పైనా రేపు వచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అటు ఈ నెల 21 నుంచి మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.
Similar News
News February 3, 2026
టారిఫ్‌ల తగ్గింపుతో ఆక్వా రైతులకు ఆదాయం: అచ్చెన్న

AP: అమెరికా టారిఫ్‌లను 25 నుంచి 18 శాతానికి తగ్గించడం వల్ల ఆక్వా రంగానికి ఉపశమనం లభిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆ దేశానికి సముద్ర ఆహార ఎగుమతులు 15% వరకు పెరుగుతాయన్నారు. కేంద్ర బడ్జెట్‌లో సీ ఫుడ్ ప్రాసెసింగ్‌కు అవసరమైన ఇన్‌పుట్స్‌పై కల్పించిన రాయితీలు ఈ రంగానికి అదనపు మద్దతును అందిస్తాయని తెలిపారు. దీంతో రైతులు, మత్స్యకారులకు ఆదాయ స్థిరత్వం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
News February 3, 2026
చేపల చెరువుల్లో నీటి పీహెచ్ స్థాయి ఎంత ఉండాలి?

☛ చేపలు ఎక్కువగా పీహెచ్ స్థాయి 7.0-8.5 మధ్య ఉన్న చెరువు నీటిలో బాగా పెరుగుతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 6.5 కన్నా తక్కువైతే (ఆమ్ల ధర్మం గల నీరు) చేపలు బలహీనమై, వ్యాధుల బారినపడతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 9 కన్నా ఎక్కువైతే (క్షార ధర్మం గల నీరు) చేపల మొప్పలు దెబ్బతిని, ప్రాణ వాయువుని గ్రహించే శక్తి చేపల్లో తగ్గుతుంది. అందుకే నీటి పీహెచ్ స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.
News February 3, 2026
మెడపై పర్‌ఫ్యూమ్ స్ప్రే చేస్తున్నారా?

చాలామందికి మెడ మీద పర్‌ఫ్యూమ్ స్ప్రే చేసుకునే అలవాటు ఉంటుంది. అయితే ఇది చాలా ప్రమాదకరమంటున్నారు వైద్యులు. ఈ అలవాటు వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నరు. మెడ భాగం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి చర్మంపై మంట, దురద, నల్ల మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా దీనిలోని రసాయనాలు థైరాయిడ్ గ్రంథిపై ప్రభావం చూపి హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. అందుకే నేరుగా చర్మంపై దుస్తులపై స్ప్రే చేసుకోవడం బెటర్.


