News October 14, 2024
ఈ జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువ: మంత్రి నారాయణ

AP: చెన్నై-నెల్లూరు మధ్య ఈనెల 17న తుఫాను తీరం దాటే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. తుఫాను పరిస్థితులు, ముందస్తు జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించారు. అన్నమయ్య, కడప, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, TRPT, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. అధికారులు ఇచ్చే సూచనలను ప్రజలు పాటించాలని కోరారు.
Similar News
News March 11, 2025
‘X’పై భారీ ఎత్తున సైబర్ ఎటాక్: మస్క్

కొన్ని గంటలుగా X(ట్విటర్) మొరాయించడంపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. Xపై పెద్ద ఎత్తున సైబర్ దాడి జరుగుతోందని ట్వీట్ చేశారు. ప్రతి రోజు ఇది జరుగుతోందన్నారు. దీని వెనుక ఒక గ్రూప్ లేదా ఏదైనా దేశం ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ దాడికి ఎవరు పాల్పడుతున్నారనేది ట్రేస్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News March 11, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 11, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 5.15 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.27 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.25 గంటలకు
ఇష: రాత్రి 7.37 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 11, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.