News October 14, 2024
ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించిన భారత్

నిజ్జర్ హత్య కేసులో కెనడా దుందుడుకు ప్రయత్నాలపై భారత్ చర్యలకు ఉపక్రమించింది. ఆరుగురు కెనడా దౌత్యవేతలను బహిష్కరించింది. భారత్‌లో కెనడా తాత్కాలిక హైకమిషనర్ స్టీవర్ట్ రాస్ వీలర్, డిప్యూటీ హైకమిషనర్ పాట్రిక్ హెబర్ట్ సహా నలుగురు కార్యదర్శులను బహిష్కరిస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. వీరందర్నీ అక్టోబర్ 19న రాత్రి 11.59 గంటలలోపు భారత్ వీడి వెళ్లాలని ఆదేశించింది.
Similar News
News July 5, 2025
సింగరేణి 136 ఏళ్ల చరిత్రలో తొలిసారి..

TG: 136 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థలో కొత్త అధ్యాయం మొదలైంది. తొలిసారిగా ఇందులో మహిళా రెస్క్యూ టీమ్ ఏర్పాటైంది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎక్స్(X) వేదికగా వెల్లడించారు. విపత్తు సమయంలో ధైర్యంగా, నైపుణ్యంతో సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ బృందానికి అభినందనలు తెలిపారు.
News July 5, 2025
కరుణ్ ‘ONE MORE’ ఛాన్స్ ముగిసినట్లేనా?

టీమ్ ఇండియా ప్లేయర్ కరుణ్ నాయర్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. జట్టులో ఇతర సభ్యులను కాదని అతడిని ఆడిస్తే మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని విమర్శిస్తున్నారు. 8 ఏళ్ల తర్వాత టెస్టుల్లోకి వచ్చిన కరుణ్ బాధ్యతారహితంగా ఆడుతున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో లార్డ్స్ వేదికగా జరగబోయే మూడో టెస్టులో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు.
News July 5, 2025
దోమల నివారణకు ఇలా చేయండి

TG: వర్షాకాలంలో దోమల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఇంటి పరిసరాల్లో నీరు నిలువకుండా చూసుకోవాలి. వాటర్ ట్యాంకులు మూతలు పెట్టి ఉంచాలి. పూల కుండీల కింద నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వాడకంలోలేని టైర్లు, పనిముట్లు బహిరంగ ప్రదేశాల్లో ఉంచొద్దు. వీటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా రాకుండా నివారించవచ్చని పేర్కొంది.