News October 15, 2024

ABDUL KALAM: పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ దాకా

image

శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పుట్టినరోజు నేడు. పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ వరకు ఆయన జీవన ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన జన్మదినోత్సవాన్ని యూఎన్ఓ అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా ప్రకటించింది. భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న కూడా వరించింది. కలాం ఎప్పుడూ చెప్పే ‘కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి’ అనే సందేశం ప్రతి ఒక్కరిలో ఆలోచన రగిలిస్తుంది.

Similar News

News October 15, 2024

ఈనెల 22న తరగతులను బహిష్కరించాలి: ఆర్.కృష్ణయ్య

image

TG: రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఈనెల 22న తరగతులను బహిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, స్కాలర్‌షిప్ రూ.5,500 నుంచి రూ.10వేలకు పెంచాలనే డిమాండ్‌తో కలెక్టరేట్లు, ఎమ్మార్వో ఆఫీసులను ముట్టడించాలని ఓ ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ కాలేజీలను నిరవధికంగా బంద్ చేయాలనే నిర్ణయాన్ని యాజమాన్యాలు ఉపసంహరించుకోవాలని కోరారు.

News October 15, 2024

‘నోబెల్’ను తెచ్చిపెట్టిన సైకిల్!

image

భారతరత్న అమర్త్య సేన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని ‘నోబెల్’ ట్విటర్‌లో పంచుకుంది. సంక్షేమ ఆర్థిక శాస్త్రంలో అవార్డు పొందడంలో ఆయన సైకిల్ కీలక పాత్ర పోషించిందని తెలిపింది. ‘మగ, ఆడపిల్లల మధ్య తేడాలపై పరిశోధన చేసేందుకు ఆయన గ్రామీణ ప్రాంతాల్లో సైకిల్‌పైనే తిరిగేవారు. పిల్లల బరువును తానే స్వయంగా కొలిచేవారు. మానవ అభివృద్ధి సూచికను అభివృద్ధి చేయడంలో ఆయన సహాయం చేశారు’ అని నోబెల్ పేర్కొంది.

News October 15, 2024

నేడు మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల తేదీల ప్రకటన

image

మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఇవాళ మ.3.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్ నిర్వహించి రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనుంది.