News October 15, 2024
నేటి నుంచి పాఠశాలల పున:ప్రారంభం
TG: తెలంగాణలో నేటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. దసరా సందర్భంగా అక్టోబర్ 2 నుంచి 14 వరకు హాలిడేస్ ఇచ్చారు. 13 రోజుల పాటు సెలవులు కొనసాగాయి. ఇక జూనియర్ కాలేజీలు నిన్నటి నుంచి పున:ప్రారంభమయ్యాయి.
Similar News
News January 3, 2025
పాపం మగాళ్లు! స్త్రీ‘శక్తి’కి బలవుతున్నారు!
<<15048434>>బస్సు<<>> ఛార్జీలను 15% పెంచుతున్న కర్ణాటక సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కాంగ్రెస్ ఇస్తున్న ‘బయ్ వన్ గెట్ వన్’ ఆఫర్ అంటూ BJP సెటైర్లు వేసింది. అభివృద్ధికి కీడుచేసే ఫ్రీ శక్తి స్కీములు ఎందుకంటూ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ‘పాపం మగాళ్లు! ఫ్రీ పేరుతో భార్యల టికెట్ డబ్బులూ చెల్లిస్తూ బలవుతున్నారు’ అని నెటిజన్లు అంటున్నారు. ఉచితాలకు ఆశపడితే ఏదోవిధంగా జేబుకు చిల్లు తప్పదని కొందరి ఫీలింగ్.
News January 3, 2025
ఫ్రీ స్కీములతో ఎకానమీ ‘శక్తి’హీనం
శక్తికి మించి వెల్ఫేర్ స్కీములతో శక్తివిహీనులవ్వడం ఖాయమనేందుకు కర్ణాటక నిదర్శనంగా మారిందని నిపుణులు అంటున్నారు. 5 గ్యారంటీల అమలుకు అష్టకష్టాలు పడుతోంది. తలకు మించి అప్పులు చేస్తోంది. Q4లో ప్రతివారం రూ.4K CR చొప్పున రూ.48K CR అప్పు చేయనుంది. FY25లో లక్షకోట్లు అప్పు చేస్తుందని అంచనా. 5 గ్యారంటీలకే రూ.60K CR ఖర్చు చేస్తున్న ప్రభుత్వం డబ్బులు రాబట్టేందుకు తిరిగి జనాల పైనే ఛార్జీల భారం వేస్తోంది.
News January 3, 2025
తొలి రోజు ముగిసిన ఆట.. బుమ్రాకు వికెట్
సిడ్నీ టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్సులో భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 9 పరుగులకే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఖవాజా(2)ను తాత్కాలిక కెప్టెన్ బుమ్రా ఔట్ చేశారు. ఆసీస్ ఇంకా 176 పరుగులు వెనకబడి ఉంది. కాగా తొలి రోజు ఆట 75.2 ఓవర్లే సాధ్యపడింది.