News October 15, 2024
SKLM: అల్పపీడనం కారణంగా హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు

బంగాళాఖాతంలో అల్పపీడన కారణంగా భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశామని EPDCL SE కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం డివిజన్ 94906 10045, 94906 12633, టెక్కలి 83328 43546, పలాస 73825 85630లలో విద్యుత్, స్తంభాలు, తీగలు నేలకొరిగినా వినియోగదారులు సంబంధిత డివిజన్ హెల్ప్ డెస్క్‌లను సంప్రదించాలని కోరారు. అలాగే టోల్ ఫ్రీ నంబరు 1912కు కూడా ఫోన్ చేయవచ్చాన్నారు.
Similar News
News January 16, 2026
శ్రీకాకుళం జిల్లాలో నేడు భోగి జరుపుకొనే ప్రాంతమిదే!

శ్రీకాకుళం జిల్లాలోని ఆ ప్రాంతవాసులు భోగి పండుగనే జరుపుకోరు. నేడు (కనుమ) రోజున ఈ వేడుకను నిర్వహించి.. అనంతరం సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. మెళియాపుట్టిలోని కొసమాల గ్రామంలో దేవాంగుల వీధిలోని చేనేతలే ఇలా భోగిని భిన్నంగా చేస్తారు. వృత్తి రీత్యా పనుల్లో తీరిక లేకపోవడమే ప్రధాన కారణం. ఆనాటి పూర్వీకుల ఆచారాన్నే ఇప్పటికీ ఆ వృత్తుల వారు కొనసాగిస్తున్నారు.
News January 15, 2026
సంక్రాంతి వేళ..శ్రీకాకుళంలో జరిగే జాతరలివే?

రైతుల కష్టానికి ప్రతీకగా సంక్రాంతి పండగను ఏటా ధనుర్మాసంలో జరుపుకుంటారు. మనకు అన్నీ సమకూర్చే భూమాతకు కృతజ్ఞతగా నేడు ఇళ్ల ముంగిట మహిళలు రంగవల్లులు వేస్తారు. శాస్త్రీయంగా, సైన్స్ ప్రకారం సూర్య గమనం నేటి నుంచి మారుతోంది. ఈ పండగ వేళ శ్రీకాకుళం జిల్లాలో జరిగే జాతరలివే:
✯ ఇచ్ఛాపురం: శివానందగిరిపై త్రినాథ్ స్వామి యాత్ర
✯ పలాస: డేకురుకొండ జాతర
✯ ఆమదాలవలస: సంగమయ్య కొండ జాతర
News January 15, 2026
ఎస్పీ కార్యాలయంలో త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి వేడుకలు

కవిరాజు, ప్రముఖ సాహిత్య, సామాజిక వేత్త త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి వేడుకలు గురువారం శ్రీకాకుళం పోలీస్ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధనపు ఎస్పీ శ్రీనివాసరావు రామస్వామి చౌదరి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో మూఢనమ్మకాలు కుల వివక్షత అసమానతలపై ఆయన నిర్భయంగా పోరాటం చేశారన్నారు. మానవతా విలువలు చాటి చెప్పారన్నారు.


