News October 15, 2024

భూముల రీసర్వే.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

image

AP: భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్ 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలంది. భూసమస్యలపై ఈ గ్రామ సభల్లో వినతులు స్వీకరిస్తారు. రీ-సర్వేతో నష్టపోయిన రైతులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

Similar News

News November 12, 2025

స్లీపర్ సెల్స్ రూపంలో టెర్రరిజం: కిరణ్ బేడీ

image

పేదరికం, నిరుద్యోగంతో యువత ఉగ్ర, తీవ్రవాదాల వైపు మళ్లుతున్నారన్నది పాత వాదన. కానీ అదిప్పుడు వైట్ కాలర్ అఫెన్సుగా మారింది. తాజాగా పట్టుబడ్డవారంతా డాక్టర్లు, ప్రొఫెసర్లే. సరిహద్దుల్ని దాటి దేశంలో స్లీపర్ సెల్స్ రూపంలో టెర్రరిజమ్ వ్యాపించిందని మాజీ IPS కిరణ్ బేడీ ఇండియాటుడే చర్చలో పేర్కొన్నారు. ఇది ప్రమాదకరమని, ప్రజల సహకారంతో అన్ని రాష్ట్రాల భద్రతా విభాగాలు ఉగ్రవాదాన్ని పూర్తిగా తుదముట్టించాలన్నారు.

News November 12, 2025

‘తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా చూడండి’

image

AP: మొంథా తుఫాన్ నష్టంపై వేగంగా నివేదిక ఇచ్చి.. రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం చంద్రబాబు కోరారు. తుఫాన్ వల్ల రూ.6,384 కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణ సాయంగా రూ.2,622 కోట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రం బృందం CMతో సమావేశమైంది. తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని బృంద సభ్యులను సీఎం కోరారు.

News November 12, 2025

SBIలో మేనేజర్ పోస్టులు

image

<>SBI <<>>10 మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ , బీఈ, బీటెక్, MBA/PGDBM/PGDBA అర్హతతో పాటు పని అనుభవంగల అభ్యర్థులు డిసెంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. మేనేజర్ పోస్టుకు 28- 40ఏళ్ల మధ్య, డిప్యూటీ మేనేజర్ పోస్టుకు 25 -35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.750. SC, ST, PWBDలకు ఫీజు లేదు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in