News October 15, 2024
లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

AP: లాసెట్ ప్రవేశాల షెడ్యూల్‌ను నాగార్జున యూనివర్సిటీ వీసీ ఆచార్య గంగాధర్ విడుదల చేశారు. లాసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులంతా ఈ నెల 16 నుంచి 20 లోపు రిజిస్ట్రేషన్, కౌన్సెలింగ్ చేయించుకోవాలన్నారు. 22 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక, 26న మార్పులు, 28న సీట్లు కేటాయిస్తామని చెప్పారు. సీట్లు పొందిన విద్యార్థులు 29, 30 తేదీల్లో ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలన్నారు.
Similar News
News November 8, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

* సీఎం చంద్రబాబు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తర్వాత జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ ఎంపికపై సీనియర్ నేతలతో చర్చించారు.
* అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శ్రీభక్త కనకదాసు జయంతి ఉత్సవాల్లో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. తత్వవేత్తగా, స్వరకర్తగా సమాజ చైతన్యానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆదరణ పథకం కింద పేదలకు పనిముట్లు అందిస్తామని చెప్పారు.
News November 8, 2025
బరువు తగ్గేందుకు విపరీతంగా మందులు వాడేస్తున్నారు.. జాగ్రత్త!

ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు చాలామంది భారతీయులు ఓ డయాబెటిస్ ఔషధాన్ని వాడుతున్నట్లు తేలింది. దీంతో మన దేశంలో వీటి అమ్మకాలు గత నెలలో ₹100 కోట్ల వరకూ జరిగాయి. అయితే ఈ మందులు తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గడానికి జీవనశైలిలో సరైన మార్పులు (పోషకాహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నిర్వహణ) ప్రధానమని సూచిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు వాడాలంటున్నారు.
News November 8, 2025
పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఎలాగంటే?

హీరో షారుఖ్ ఖాన్‌పై IND మాజీ ప్లేయర్ పుజారా భార్య పూజ ప్రశంసలు కురిపించారు. ఆమె రాసిన పుస్తకంలో షారుఖ్ తమ కుటుంబానికి చేసిన సాయాన్ని వివరించారు. ‘2008లో పుజారా మోకాలికి గాయమైంది. అప్పుడు SAలో చికిత్స చేయించేందుకు KKR యాజమాన్యం ముందుకొచ్చింది. అతనికి సాయంగా వెళ్లేందుకు పుజారా తండ్రికి పాస్‌పోర్ట్, ప్రయాణానికి షారుఖ్ సాయం చేశారు. KKR తరఫున పుజారా ఆడకపోయినా సాయం చేయడం గొప్ప విషయం’ అని గుర్తు చేశారు.


