News October 15, 2024

బ్రిటన్ ప్రధానికి ఫోన్ చేసిన ట్రూడో.. భారత్‌పై ఫిర్యాదు

image

బ్రిటన్ PM కీర్ స్టార్మర్‌కు ఫోన్ చేసినట్టు కెనడా PM జస్టిన్ ట్రూడో ట్వీట్ చేశారు. తమ పౌరులపై భారత ప్రభుత్వ ఏజెంట్ల టార్గెటెడ్ క్యాంపెయిన్‌ను వివరించానన్నారు. ప్రజల భద్రత, క్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడంపై చర్చించామన్నారు. ఈ సీరియస్ మ్యాటర్ పరిష్కారానికి భారత్ సహకారం తీసుకొనేందుకు ఆసక్తిగా ఉన్నానన్నారు. జియోపాలిటిక్స్‌లో ప్రాధాన్యం తగ్గిన UKకు ఫోన్ చేస్తే లాభమేంటని నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు.

Similar News

News January 13, 2026

ములుగు: మద్దతిచ్చిన జిల్లాకు మంగళం పాడుతారా..!?

image

రాష్ట్రంలో చిట్టచివరన ఏర్పడ్డ జిల్లా ములుగు. జిల్లా కోసం రాజకీయ, ప్రజా, జర్నలిస్టు సంఘాల చేసిన పోరాటానికి విపక్ష నేతగా నేటి సీఎం రేవంత్ రెడ్డి మద్దతుగా నిలిచారు. జర్నలిస్టుల పాదయాత్ర ముగింపు సభలో పాల్గొని సర్కారును నిలదీశారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దిగివచ్చింది. 2019 ఫిబ్రవరి 17న జిల్లా మనుగడలోకి వచ్చింది. జిల్లాల కుదింపు అంశం నేడు తెరపైకి రాగా సీఎం స్పందన, ‘ములుగు’ భవిష్యత్‌పై ఆసక్తి నెలకొంది.

News January 13, 2026

‘MSVPG’కి ఫస్ట్ డే రూ.84 కోట్లు

image

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం నిన్న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రీమియర్స్+ఫస్ట్ డేకి కలిపి రూ.84 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. అన్ని సెంటర్లలో రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయని పేర్కొంది. చిరంజీవి లుక్స్, మేనరిజం, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ అభిమానులను మెప్పిస్తున్నాయి.

News January 13, 2026

టెన్త్ అర్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

CSIR-సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (<>CCIO<<>>) 7 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులై, 25ఏళ్ల లోపు గల అభ్యర్థులు ఫిబ్రవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. స్క్రీనింగ్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.36,306 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.590. SC, ST, PwBD, మహిళలకు ఫీజు లేదు. సైట్: https://csio.res.in/