News October 15, 2024

NZB: స్పెషల్ బస్సులు.. భారీగా RTC ధరలు

image

దసరా సెలవులు ముగిసిన నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా RTC అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేశారు. కాగా బోధన్ నుంచి NZBకు ఎక్స్‌ప్రెస్ బస్సు సాధారణ సమయాల్లో రూ.50 ఉండగా.. తాజాగా రూ.70 తీసుకుంటున్నారు. అదేంటని ప్రశ్నిస్తే దసరా సందర్భంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేశారని, అందుకే ధర పెంచినట్లు తెలిపారు. ఈ క్రమంలో కండక్టర్‌కు, ప్రయాణికుల మధ్య కాస్త వాగ్వాదం జరిగింది.
– మీ వద్ద ధరలు ఎలా ఉన్నాయి..?

Similar News

News January 2, 2025

రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

image

 జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలు, ఫ్లెక్సీలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాలను నిలువరించేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా చర్యలు పాటించేలా ప్రజల్లో అవగాహన పెంపొందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు సూచించారు.

News January 2, 2025

NZB: జస్టిస్ షమీం అక్తర్‌ను కలిసిన బార్ అసోసియేషన్ ప్రతినిధులు

image

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఎస్సీ వర్గీకరణ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ శమీమ్ అక్తర్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. జిల్లా కేంద్రానికి అధికారిక పర్యటన నిమిత్తం చేరుకున్న సందర్భంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూలు జగన్ మోహన్ గౌడ్, బార్ ప్రధాన కార్యదర్శి వసంత్ రావు, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుభేదార్ ప్రభుత్వ అతిధి గృహంలో కలిసి పూలమాలలు అందజేశారు.

News January 2, 2025

NZB: సమగ్ర నివేదిక సమర్పిస్తాం: జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్

image

ఎస్సీ వర్గీకరణ అంశంపై అన్ని వర్గాల వారి అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని ఏకసభ్య కమిషన్ ఛైర్మన్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ స్పష్టం చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. అన్ని ఉమ్మడి జిల్లాలలో అందరి అభిప్రాయాలను సేకరించిన మీదట ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.