News October 15, 2024

గ్రూప్-1 పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

image

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 7 ప్రశ్నలకు తుది ‘కీ’లో సరైన ఆన్సర్లు ఇవ్వలేదని, వాటికి మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని పలువురు పిటిషన్లు వేశారు. తాజాగా హైకోర్టు ఈ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ యథావిధిగా జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి.

Similar News

News October 15, 2024

అమెరికాతో భార‌త్‌ కీల‌క ఒప్పందం

image

స‌రిహ‌ద్దుల్లో నిఘా వ్య‌వ‌స్థ ప‌టిష్ఠ‌త‌కు అమెరికా నుంచి 31 ప్రిడేట‌ర్ MQ-9B డ్రోన్ల కొనుగోలుకు భార‌త్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేర‌కు ఇరు దేశాలు ఒప్పందంపై మంగ‌ళ‌వారం సంత‌కాలు చేశాయి. గ‌త నెల అమెరికా ప‌ర్య‌ట‌నలో ఆ దేశాధ్య‌క్షుడు బైడెన్‌తో ప్ర‌ధాని మోదీ ఇదే విష‌య‌మై చ‌ర్చించారు. డ్రోన్ల కొనుగోలు స‌హా నిర్వ‌హ‌ణ‌, మ‌ర‌మ్మ‌తుల వ్యవ‌స్థ ఏర్పాటుకు ఒప్పందాలు జ‌రిగాయి. ఈ ఒప్పందం విలువ రూ.34,500 కోట్లు.

News October 15, 2024

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో 18న సీఎం భేటీ

image

AP: టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు ఈ నెల 18న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. మార్చిలో జరిగే పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. మద్యం, ఇసుక వ్యవహారాల్లో అధికార పార్టీ నేతల జోక్యంపై విమర్శలు వస్తుండటంపై వివరణ తీసుకుంటారని తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల కేటాయింపుపైనా చర్చిస్తారని, ప్రభుత్వ పనితీరుపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారని సమాచారం.

News October 15, 2024

రాజకీయాలు వేరు, దేశ భద్రత వేరు: రాజ్‌నాథ్

image

TG: రాజకీయంగా పార్టీలు వేరైనప్పటికీ దేశాభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘రాజకీయాలు వేరు, దేశ భద్రత వేరు. దేశ రక్షణ రంగంలో నేవీ రాడార్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి CM రేవంత్ చేసిన కృషి అభినందనీయం. కలాం జయంతి రోజున ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది’ అని దామగుండంలో రాడార్ స్టేషన్‌‌కు శంకుస్థాపన అనంతరం వ్యాఖ్యానించారు.