News October 15, 2024

మిసైల్ మ్యాన్ స్ఫూర్తిదాయక కోట్స్!

image

యువతలో స్ఫూర్తినింపేందుకు APJ అబ్దుల్ కలాం చెప్పిన సూక్తులు మీకోసం. 1. సక్సెస్ అంటే మీ సంతకం ఆటోగ్రాఫ్‌గా మారడమే. 2. నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే.. ముందు సూర్యుడిలా మండటానికి సిద్ధపడాలి. 3. ఒక మంచి పుస్తకం వందమంది మిత్రులతో సమానం. కానీ ఓ మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానం. 4. కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి. 5. మన జననం సాధారణమైనదే కావచ్చు.. కానీ మన మరణం చరిత్ర సృష్టించేలా ఉండాలి.

Similar News

News October 15, 2024

వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం: టాటా గ్రూప్

image

సెమీ కండక్టర్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీల తయారీ రంగంలో వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. తయారీ రంగంలో జాబ్స్ క్రియేట్ చేయలేకపోతే అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న భారత్ లక్ష్యం నెరవేరదని అన్నారు. 100మిలియన్ల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒక్కో మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్ వల్ల 8-10 ఇన్‌డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవుతాయన్నారు.

News October 15, 2024

అమెరికాతో భార‌త్‌ కీల‌క ఒప్పందం

image

స‌రిహ‌ద్దుల్లో నిఘా వ్య‌వ‌స్థ ప‌టిష్ఠ‌త‌కు అమెరికా నుంచి 31 ప్రిడేట‌ర్ MQ-9B డ్రోన్ల కొనుగోలుకు భార‌త్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేర‌కు ఇరు దేశాలు ఒప్పందంపై మంగ‌ళ‌వారం సంత‌కాలు చేశాయి. గ‌త నెల అమెరికా ప‌ర్య‌ట‌నలో ఆ దేశాధ్య‌క్షుడు బైడెన్‌తో ప్ర‌ధాని మోదీ ఇదే విష‌య‌మై చ‌ర్చించారు. డ్రోన్ల కొనుగోలు స‌హా నిర్వ‌హ‌ణ‌, మ‌ర‌మ్మ‌తుల వ్యవ‌స్థ ఏర్పాటుకు ఒప్పందాలు జ‌రిగాయి. ఈ ఒప్పందం విలువ రూ.34,500 కోట్లు.

News October 15, 2024

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో 18న సీఎం భేటీ

image

AP: టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు ఈ నెల 18న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. మార్చిలో జరిగే పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. మద్యం, ఇసుక వ్యవహారాల్లో అధికార పార్టీ నేతల జోక్యంపై విమర్శలు వస్తుండటంపై వివరణ తీసుకుంటారని తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల కేటాయింపుపైనా చర్చిస్తారని, ప్రభుత్వ పనితీరుపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారని సమాచారం.