News October 15, 2024
ఎన్నికల్లో ఉచిత హామీలతో లాభమేంటి?

అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీలకు సులభంగా దొరికిన అస్త్రం ‘ఉచితం’. ఏ దేశమైనా ఎదగాలంటే ప్రాజెక్టులు, ఇన్ఫ్రా, రోడ్ల నిర్మాణం, ఉపాధి కల్పనకు ప్రోత్సాహకాల వంటివి ప్రకటించాలి. ఇందుకు భిన్నంగా బస్సుల్లో ఫ్రీ, కరెంటు ఫ్రీ, అకౌంట్లలోకి డబ్బుల బదిలీతో రాష్ట్ర ఖజానాలు ఖాళీ అవ్వడం చూస్తూనే ఉన్నాం. ఫ్రీబీస్‌పై అభిప్రాయం కోరుతూ కేంద్రం, ECIకి సుప్రీంకోర్టు తాజాగా నోటీసులిచ్చింది. దీనిపై మీ కామెంట్?
Similar News
News January 8, 2026
బలపడిన వాయుగుండం.. తుఫానుగా మారే ఛాన్స్!

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారనుందని IMD తెలిపింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. తర్వాత ఈ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే ఛాన్స్ కూడా ఉంది. దీంతో అధికారులు వైజాగ్, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగవరం పోర్టులకు ఒకటో నంబర్ తుఫాను హెచ్చరిక జారీ చేశారు.
News January 8, 2026
ప్రధాని మోదీ ఆస్తులు ఎంతంటే?

PM నరేంద్ర మోదీ ఆస్తుల విలువ రూ.3.02 కోట్లకు చేరిందని ఏడీఆర్ (Association for Democratic Reforms) నివేదిక వెల్లడించింది. 2014తో పోలిస్తే పదేళ్లలో ఆయన ఆస్తులు 82% పెరిగాయి. ఇక లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆస్తులు 2014లో రూ.9.4 కోట్లుగా ఉండగా, 2024 నాటికి రూ.20.39 కోట్లకు చేరి 117% వృద్ధి నమోదైంది. వరుసగా 3 సార్లు గెలిచిన ఎంపీల సగటు ఆస్తులు కూడా పదేళ్లలో 110% పెరిగినట్లు ADR తెలిపింది.
News January 8, 2026
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<


