News October 15, 2024
దేవర మూవీ మరో రికార్డ్
కలెక్షన్లలో ‘దేవర’ మూవీ మరో ఘనత సాధించింది. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి 18రోజుల పాటు కనీసం రూ.కోటి చొప్పున వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. కొవిడ్ తర్వాత ఈ స్థాయి కలెక్షన్లు రాబట్టిన సినిమా ఇదే అని పేర్కొన్నాయి. ఇటు సీడెడ్‌లో కలెక్షన్లు రూ.30 కోట్లు దాటాయి. దీంతో ఆ ఏరియాలో రూ.30 కోట్లు దాటిన 2 సినిమాలు ఉన్న వ్యక్తిగా NTR నిలిచారు. ఇప్పటి వరకు ఈ మూవీ రూ.510 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
Similar News
News January 3, 2025
BREAKING: కష్టాల్లో భారత్
ఆసీస్‌తో జరుగుతున్న 5వ టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. 72 పరుగులకే కీలకమైన 4 వికెట్లను కోల్పోయింది. లంచ్ బ్రేక్‌కు మూడు వికెట్లు పడగా, ఆ తర్వాత బోలాండ్ బౌలింగ్‌లో ఎప్పటిలాగే కోహ్లీ(17) స్లిప్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆఫ్ సైడ్ వెళ్లే బంతిని అనవసర షాట్‌కు యత్నించి విరాట్ వికెట్ సమర్పించుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో పంత్(9), జడేజా(0) ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 76/4.
News January 3, 2025
8న విశాఖలో రైల్వేజోన్‌కు ప్రధాని శంకుస్థాపన
AP: PM మోదీ 8న విశాఖపట్నంలో రైల్వేజోన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ రోజు నగరంలోని సంపత్ వినాయక టెంపుల్ నుంచి AU ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లోని సభా ప్రాంగణం వరకు మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. పూడిమడకలో NTPC ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్, కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ హబ్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్, తదితర అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
News January 3, 2025
ఫిబ్రవరిలో పంచాయతీతో పాటు మున్సిపల్ ఎన్నికలు!
TG: పంచాయతీ ఎలక్షన్లతో పాటు లేదా కొద్దిరోజుల గ్యాప్‌తో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ నెల 26తో మున్సిపాలిటీల గడువు ముగియనుండగా సంక్రాంతి తర్వాత షెడ్యూల్ రిలీజ్ చేసి FEB మొదటివారంలోగా 3 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారని సమాచారం. బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం వెలువడకపోవడంతో పంచాయతీ ఎన్నికలు ఆలస్యమయ్యాయి. మున్సిపాలిటీలకు ఆ సమస్య లేకపోవడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.