News October 15, 2024

రాజకీయాలు వేరు, దేశ భద్రత వేరు: రాజ్‌నాథ్

image

TG: రాజకీయంగా పార్టీలు వేరైనప్పటికీ దేశాభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘రాజకీయాలు వేరు, దేశ భద్రత వేరు. దేశ రక్షణ రంగంలో నేవీ రాడార్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి CM రేవంత్ చేసిన కృషి అభినందనీయం. కలాం జయంతి రోజున ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది’ అని దామగుండంలో రాడార్ స్టేషన్‌‌కు శంకుస్థాపన అనంతరం వ్యాఖ్యానించారు.

Similar News

News October 15, 2024

కొవిడ్ సోకిన పిల్లలకు డయాబెటిస్ ముప్పు అధికం: పరిశోధకులు

image

కొవిడ్ సోకిన పిల్లలు, యువతలో డయాబెటిస్ వచ్చే ముప్పు చాలా ఎక్కువగా ఉందని USలోని కేస్ వెస్టర్న్ రిజర్వ్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో తేలింది. 2020 జనవరి-2022 డిసెంబరు మధ్యకాలంలోని వైద్య రికార్డులను వారు పరిశీలించారు. కొవిడ్ సోకిన పిల్లలకు, సాధారణ శ్వాసకోశ సమస్యలున్న పిల్లలకు మధ్య టైప్-2 డయాబెటిస్ వ్యత్యాసాన్ని గమనించగా.. కరోనా సోకిన వారిలో తర్వాతి 6 నెలల్లోనే డయాబెటిస్ వచ్చినట్లు గుర్తించారు.

News October 15, 2024

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో కీలక పరిణామం

image

AP స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. సీమెన్స్ సంస్థకు చెందిన రూ.23 కోట్ల విలువైన ఆస్తులను ఎటాచ్ చేసింది. నకిలీ బిల్లులతో కొనుగోళ్లు జరిపినట్లు, వ్యక్తిగత ఖాతాలకు ఈ సంస్థ నిధులు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఏపీ సీఐడీ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇదే కేసులో గతేడాది చంద్రబాబు జైలుకెళ్లారు.

News October 15, 2024

Air India విమానానికి బాంబు బెదిరింపు.. కెనడాకు మ‌ళ్లింపు

image

ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న Air India విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో విమానాన్ని అత్య‌వ‌స‌రంగా కెనడాలోని ఇకలూయిట్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. ఆన్‌లైన్ పోస్టు ద్వారా అందిన భ‌ద్ర‌తా ముప్పు కార‌ణంగా మార్గ‌మధ్యలో ఉన్న AI127 విమానాన్ని మ‌ళ్లించిన‌ట్టు సంస్థ ప్ర‌క‌టించింది. ఇటీవ‌ల న‌కిలీ బెదిరింపులు అధిక‌మైనా బాధ్య‌త‌గ‌ల సంస్థగా వీటిని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్టు తెలిపింది.