News October 15, 2024

టాలెంట్ కాదు.. వ్యక్తిగత కనెక్షన్స్ ఉంటేనే జాబ్!

image

ఉద్యోగాలు పొందడంలో బంధుప్రీతి ప్రభావం ఉంటుందని స్టాండ్‌అవుట్ CV సర్వేలో తేలింది. సర్వేలోని 70.2% మంది వారి వ్యక్తిగత కనెక్షన్స్ ద్వారా సత్వరమే జాబ్ ఆఫర్‌ను అందుకున్నట్లు వెల్లడైంది. స్నేహితుల ద్వారా 62.1% మంది, ఫ్యామిలీ ద్వారా 37.9% మంది ఉద్యోగాలు పొందారు. 90.6% మంది బంధుప్రీతి అనైతికమని అంగీకరించారు. వ్యక్తిగత కనెక్షన్ల ద్వారా ఉద్యోగం పొందిన ప్రతి ముగ్గురిలో ఒకరు తమకు అర్హత లేదని ఒప్పుకున్నారు.

Similar News

News January 13, 2026

పిల్లలపై పోసిన భోగి పళ్లను తినవచ్చా?

image

భోగి పళ్లను దిష్టి తీయడానికి పోస్తారు కాబట్టి తినొద్దని కొందరు అనుకుంటారు. అయితే వీటిని తినొచ్చని పండితులు సూచిస్తున్నారు. బదరీ ఫలాలను సాక్షాత్తు నారాయణ స్వరూపంగా భావిస్తారు కాబట్టి తిన్నా ఏ దోషం ఉండదని అంటున్నారు. అయినప్పటికీ అనుమానం ఉన్నా, తినడానికి ఇష్టం లేకపోయినా కొన్ని పండ్లను విడిగా ముందే పక్కకు తీసి పెట్టుకోవాలి. రేగుపళ్లలో సి-విటమిన్ అధికంగా ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

News January 13, 2026

ఇరాన్‌తో వ్యాపారం చేస్తే 25% టారిఫ్: ట్రంప్

image

ఇరాన్‌తో ఉద్రిక్తతల వేళ ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త పథకం రచించారు. ఇరాన్‌తో వ్యాపారం చేయకుండా కొత్త టారిఫ్స్ తీసుకొచ్చారు. ఏ దేశాలైతే ఇరాన్‌తో వ్యాపారం చేస్తాయో.. అవి USతో బిజినెస్ చేయాలంటే 25% టారిఫ్స్ చెల్లించాల్సి ఉంటుంది అని ప్రకటించారు. ఈ నిర్ణయం ఇప్పుడే అమలులోకి వస్తుందని చెప్పారు. ఇది ఫైనల్ అంటూ కుండ బద్దలు కొట్టేశారు.

News January 13, 2026

ముంబైలో నయా దందా.. 30 వేలకే భారత పౌరసత్వం?

image

ముంబైలో అక్రమ వలసదారులపై NDTV కథనం కలకలం రేపుతోంది. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన వారికి కేవలం రూ.7 వేల నుంచి రూ.30 వేలకే బర్త్ సర్టిఫికెట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు వంటి నకిలీ పత్రాలు అందుతున్నట్లు వెల్లడించింది. 61 ప్రాంతాల్లో 3,014 మందిని పరిశీలించగా వీరిలో 96% అక్రమంగా భారత్‌లోకి వచ్చిన ముస్లింలేనని తెలిపింది. ‘మాల్వాణి ప్యాటర్న్’ పేరుతో వీరంతా ఓటు బ్యాంకులుగా మారుతున్నారని పేర్కొంది.