News October 15, 2024
నాటకీయం ‘మహా’ రాజకీయం (2/2)

ఉద్ధవ్ ప్రభుత్వం Nov 28, 2019న ఏర్పడింది. కాంగ్రెస్, NCPలు అధికారంలో భాగస్వామ్యం అయ్యాయి. అయితే, జూన్ 29, 2022న, అంటే ఉద్ధవ్ CM పదవి చేపట్టిన 31 నెలలకు BJP రాజకీయ ఎత్తుగడలకు శివసేన, NCP చీలిపోయాయి. 40 మంది MLAలతో ఏక్‌నాథ్ శిండే వర్గం శివసేన పార్టీని క్లైం చేసుకొని BJP వెంట నడిచింది. దీంతో MVA కూటమి ప్రభుత్వం కూలిపోయింది. BJP అండతో ఏకనాథ్ శిండే CM పదవి దక్కించుకున్నారు.
Similar News
News January 24, 2026
ESIC నోయిడాలో ఉద్యోగాలు

<
News January 24, 2026
సూర్యుడు మన అనారోగ్యాలను ఎలా దూరం చేస్తాడు?

సూర్యుడిని ఆరోగ్య ప్రదాతగా కొలుస్తాం. అందుకే ‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్’ అంటాం. అంటే ఆరోగ్యం సూర్యుని వల్ల కలుగుతుందని అర్థం. సూర్యకిరణాల వల్ల శరీరంలో విటమిన్ D తయారవుతుంది. ఇది ఎముకల పుష్టికి చాలా అవసరం. సూర్యోపాసనతో ఆత్మశక్తి పెరుగుతుంది. నేత్ర, హృదయ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ప్రాచీన కాలం నుంచి ఉన్న సంధ్యావందనం, సూర్య నమస్కారాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం సూర్యరశ్మి ద్వారా ఆరోగ్యాన్ని పొందడమే!
News January 24, 2026
జీరో టిల్లేజ్ మొక్కజొన్నలో కలుపు నివారణ

పంట విత్తిన 48గంటల్లో 200L నీటిలో అట్రాజిన్ 1kg పొడి మందు కలిపి పిచికారీ చేయాలి. వరి దుబ్బులు చిగురు వేయకుండా ఎకరాకు 200L నీటిలో పారాక్వాట్ 1L కలిపి విత్తే ముందు లేదా విత్తాక పిచికారీ చేయాలి. 20-25 రోజులకు వెడల్పాటి కలుపు మాత్రమే ఉంటే 200L నీటిలో 400 గ్రా. 2,4-D సోడియంసాల్ట్ కలిపి పిచికారీ చేయాలి. గడ్డి, ఆకుజాతి కలుపు ఉంటే ఎకరానికి 200L నీటిలో టెంబోట్రాయాన్ 34.4% 115ml కలిపి పిచికారీ చేయాలి.


