News October 15, 2024

2019లో మహారాష్ట్రలో ఏం జరిగింది? (1/2)

image

2019 Octలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో BJP- అప్ప‌టి ఉద్ధ‌వ్ నేతృత్వంలోని శివ‌సేన కూట‌మి 161 స్థానాలు గెలుచుకుంది. BJP105, శివ‌సేన 56 సీట్లు ద‌క్కించుకున్నాయి. అయితే, ఫ‌లితాల త‌రువాత త‌మ‌కూ CM ప‌ద‌వి ఇవ్వాల‌ని శివ‌సేన మెలిక పెట్టింది. దీనికి BJP అంగీక‌రించ‌లేదు. దీంతో కాంగ్రెస్ (44), ఎన్సీపీ (54)ల మ‌ద్ద‌తుతో ఉద్ధ‌వ్ ఠాక్రే CM అయ్యారు. త‌ద్వారా మ‌హారాష్ట్రలో మ‌హావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్ప‌డింది.

Similar News

News October 31, 2025

చొరబాటుదారుల్ని వెనక్కి పంపిస్తాం: మోదీ

image

దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారందరినీ వెనక్కి పంపిస్తామని PM మోదీ పునరుద్ఘాటించారు. చొరబాట్లు దేశ ఐక్యతకు ముప్పుగా మారుతాయని, గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలతో వాటిని పట్టించుకోలేదని విమర్శించారు. చొరబాట్లను అడ్డుకొనే వారికి అడ్డుపడుతూ కొన్ని పార్టీలు దేశాన్ని బలహీనపరుస్తున్నాయని ఆరోపించారు. ‘దేశ భద్రతకు రిస్క్ ఏర్పడితే ప్రతి పౌరుడు ప్రమాదంలో పడినట్లే’ అని ‘ఏక్తాదివస్’లో PM హెచ్చరించారు.

News October 31, 2025

భారత్‌కు బిగ్ షాక్

image

ఆస్ట్రేలియాతో రెండో టీ20లో భారత టాపార్డర్ కుప్పకూలింది. 32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ గిల్ 5 రన్స్ చేసి ఔట్ కాగా తర్వాత సంజూ 2, సూర్య 1, తిలక్ వర్మ డకౌట్ అయ్యారు. ఆసీస్ బౌలర్ హేజిల్‌వుడ్ 3 ఓవర్లలో కేవలం 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు. మరోవైపు వికెట్లు పడుతున్నా అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతున్నారు. 9 బంతుల్లో 3 ఫోర్లు ఒక సిక్సర్‌తో 24 రన్స్ చేశారు.

News October 31, 2025

ఎకరాకు రూ.50వేల పరిహారం ఇవ్వాలి: కవిత

image

TG: తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో జనంబాట యాత్రలో భాగంగా మక్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. సర్కార్ ప్రకటించిన ఎకరాకు రూ.10వేల పరిహారం ఏ మూలకూ సరిపోదని వ్యాఖ్యానించారు. మొలకెత్తినా, బూజు పట్టినా, తేమ శాతం ఎక్కువగా ఉన్నా ధాన్యం కొనాలన్నారు.