News October 15, 2024
రేపటి నుంచి నూతన లిక్కర్ పాలసీ.. షాపుల టైమింగ్స్ ఇవే

AP: లాటరీలో 3,396 మద్యం షాపుల కేటాయింపు పూర్తవడంతో రేపటి నుంచి నూతన లిక్కర్ పాలసీ అమల్లోకి రానుంది. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు అమ్మకాలు జరగనున్నాయి. ఇకపై డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని షాపుల యజమానులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Similar News
News December 25, 2025
ప్రస్తుతం నా క్రష్ మృణాల్ ఠాకూర్: నాగవంశీ

హీరోయిన్లలో రష్మిక అంటే ఇష్టమని, మృణాల్ ఠాకూర్ తన క్రష్ అని నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరోవైపు Ntr నటించిన ‘వార్-2’కు భారీ నష్టాలంటూ జరిగిన ప్రచారంపై ఆయన స్పందించారు. ‘తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను రూ.68 కోట్లకు కొన్నాను. దానికి రూ.35-40 కోట్ల షేర్ వచ్చింది. ఈ క్రమంలో ఆ మూవీ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ పిలిచి రూ.18 కోట్లు వెనక్కి ఇచ్చింది. పెద్దగా నష్టాలు రాలేదు’ అని పేర్కొన్నారు.
News December 25, 2025
బంగ్లాదేశ్‌లో హిందువుల ఇళ్లకు నిప్పు..

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గడిచిన 5 రోజుల్లో 7 హిందూ కుటుంబాలపై <<18670618>>నిరసనకారులు<<>> దాడి చేసినట్టు తెలుస్తోంది. 2 ఇళ్లకు నిరసనకారులు నిప్పుపెట్టిన ఘటనలో 8 మంది త్రుటిలో తప్పించుకున్నారు. ఈ దాడి చేసినట్టు అనుమానిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితం కూడా హిందువుల ఇంటిపై నిరసనకారులు దాడి చేశారు.
News December 25, 2025
శివాజీ వ్యాఖ్యల వివాదం.. అనసూయ వార్నింగ్

TG: శివాజీ వివాదాస్పద <<18666465>>వ్యాఖ్యల<<>> నేపథ్యంలో నటి అనసూయ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. రాజ్యాంగంలో ఆర్టికల్-19 కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని అడ్వకేట్ లీలా శ్రీనివాస్ మాట్లాడిన <


