News October 15, 2024
వయనాడ్.. ప్రియాంకా గాంధీ పోటీ చేసేనా?
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాలకే పరిమితమైన ప్రియాంకా గాంధీ పోటీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాహుల్ గాంధీ రాజీనామాతో NOV 13న వయనాడ్(కేరళ) పార్లమెంట్‌కు <<14363811>>బైపోల్<<>> జరగనుండగా, ఇక్కడ ఆమె బరిలో దిగే ఛాన్స్ ఉంది. INC చీఫ్ ఖర్గే, సీనియర్ నేతలు ఆమె పోటీ చేస్తారని పలుమార్లు ప్రకటించారు. అయితే ప్రియాంక స్పందించలేదు. ఒకవేళ ఆమె పోటీ చేసి గెలిస్తే ఆ సెగ్మెంట్‌లో గెలిచిన తొలి మహిళా ఎంపీగా చరిత్ర సృష్టించనున్నారు.
Similar News
News December 22, 2024
స్మృతి మంధాన మరో ఘనత
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరో అరుదైన ఘనత సాధించారు. ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచారు. ఈ ఏడాది ఆమె 1,602 పరుగులు చేశారు. ఈ క్రమంలో లారా వాల్వడర్ట్(1,593)ను అధిగమించారు. విండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆమె ఈ ఫీట్ సాధించారు. కాగా ఈ మ్యాచులో స్మృతి (91) కొద్దిలో శతకం చేజార్చుకున్నారు. జేమ్స్ బౌలింగ్‌లో ఆమె వికెట్ల ముందు దొరికిపోయారు.
News December 22, 2024
అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణలు చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి
TG: సీఎం రేవంత్ రెడ్డికి సినీ నటుడు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ దెబ్బతీశారని బన్నీ మాట్లాడటం సరికాదన్నారు. ఆసుపత్రిలో బాలుడిని పరామర్శించేందుకు లీగల్ టీమ్ ఒప్పుకోలేదనడం హాస్యాస్పదమని చెప్పారు. మనిషి చనిపోయాక ఐకాన్ స్టార్ అయితే ఏంటి? సూపర్ స్టార్ అయితే ఏంటి? అని ప్రశ్నించారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని స్పష్టం చేశారు.
News December 22, 2024
ప్రజలపై ‘చంద్ర’బాదుడు: వైసీపీ నేతలు
AP: అధికారంలోకి వచ్చిన తర్వాత CM చంద్రబాబు హామీలను గాలికొదిలేశారని YCP నేతలు జోగి రమేశ్, మేరుగు నాగార్జున, వెలంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ నెల 27న YCP పోరుబాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం మోయలేక ప్రజలు అల్లాడుతున్నారు. SC, STలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు మంగళం పలికారు. ధాన్యానికి మద్దతు ధర దక్కడం లేదు. చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతాం’ అని వారు మండిపడ్డారు.