News October 15, 2024

కొవిడ్ సోకిన పిల్లలకు డయాబెటిస్ ముప్పు అధికం: పరిశోధకులు

image

కొవిడ్ సోకిన పిల్లలు, యువతలో డయాబెటిస్ వచ్చే ముప్పు చాలా ఎక్కువగా ఉందని USలోని కేస్ వెస్టర్న్ రిజర్వ్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో తేలింది. 2020 జనవరి-2022 డిసెంబరు మధ్యకాలంలోని వైద్య రికార్డులను వారు పరిశీలించారు. కొవిడ్ సోకిన పిల్లలకు, సాధారణ శ్వాసకోశ సమస్యలున్న పిల్లలకు మధ్య టైప్-2 డయాబెటిస్ వ్యత్యాసాన్ని గమనించగా.. కరోనా సోకిన వారిలో తర్వాతి 6 నెలల్లోనే డయాబెటిస్ వచ్చినట్లు గుర్తించారు.

Similar News

News October 16, 2024

ఏపీకి కేంద్రం శుభవార్త

image

ఏపీకి కేంద్రం మరో శుభవార్త అందించింది. కృష్ణా జిల్లా నాగాయలంకలో క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. దీంతో ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. దేశ రక్షణ, సౌకర్యాల కల్పనలో కృష్ణా జిల్లా కీలకపాత్ర పోషిస్తోందని CM చెప్పారు. DRDO ఆధ్వర్యంలో ఈ టెస్టింగ్ సెంటర్ అందుబాటులోకి రానుంది.

News October 16, 2024

‘ఎల్లమ్మ’కు నితిన్ గ్రీన్ సిగ్నల్?

image

‘బలగం’ ఫేమ్ వేణు దర్శకత్వంలో నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ‘ఎల్లమ్మ’ కథను నాని, శర్వానంద్, తేజా సజ్జ వంటి హీరోలకు ఆయన వినిపించారు. తాజాగా ఈ కథ విన్న నితిన్ వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రాబిన్ హుడ్, తమ్ముడు అనే చిత్రాల షూటింగ్ ముగియగానే ‘ఎల్లమ్మ’ మొదలవుతుందని టాలీవుడ్ టాక్. ఈ మూవీని దిల్ రాజు నిర్మించనున్నారు.

News October 16, 2024

ఈ నెల 17న గరుడ సేవ ఊరేగింపు

image

తిరుమ‌లలో ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ నెల 17న పౌర్ణమి సందర్భంగా నెలవారీ గరుడసేవ జరుగనుంది. దీనిలో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీమలయప్ప స్వామి గరుడ వాహనంపై తిరు మాడ వీధులలో విహ‌రించి భక్తులకు దర్శనమిస్తారు.