News October 15, 2024
విజయనగరంలో సందడి చేసిన సినీ తారలు

విజయనగరంలో ‘జనక అయితే గనక’ సినిమా హీరో సుహాస్, హీరోయిన్ సంఘీర్తన మంగళవారం సందడి చేశారు. సినిమా సక్సెస్ మీట్‌లో భాగంగా స్థానిక సప్తగిరి సినిమా హాల్‌కు విచ్చేశారు. ఈ నేపథ్యంలో పైడితల్లి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చిన్న సినిమా అయినప్పటికీ, పెద్ద ఎత్తున హిట్ సాధించిందని, ఈ నేపథ్యంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నట్లు చెప్పారు.
Similar News
News September 16, 2025
VZM: ప్రత్యేక అలంకరణలో పైడిమాంబ

ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు విజయనగరం శ్రీపైడితల్లి అమ్మవారిని ఆలయ అర్చకులు సుందరంగా అలంకరించారు. మంగళవారం సందర్భంగా ప్రధాన ఆలయంతో పాటు చదురు గుడిలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపించి వివిధ రకాల పుష్పాలతో ముస్తాబు చేశారు. అనంతరం కుంకుమ పూజలు నిర్వహించి భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. సిరిమానోత్సవాల్లో భాగంగా ప్రత్యేక అలంకరణలో అమ్మవారు శోభిల్లుతున్నారు.
News September 16, 2025
VZM: మహిళల ఆరోగ్య పరిరక్షణకు వరం

మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్ పథకం ఎంతో దోహదం చేస్తుందని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అన్నారు. ఈ పథకానికి సంబంధించి గోడ పత్రికను ఆయన కలెక్టరేట్లో సోమవారం ఆవిష్కరించారు. దీని ద్వారా వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించి, అవసరమైనవారికి తగిన వైద్య సదుపాయాన్ని అందించాలని సూచించారు.
News September 15, 2025
విజయనగరం ఎస్పీ కార్యాలయానికి 32 ఫిర్యాదులు

ఫిర్యాదు చేసిన బాధితుల సమస్యలను పోలీసు అధికారులు చట్ట పరిధిలో పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ పి.సౌమ్య లత అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె ప్రజల నుండి 32 ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి 7 రోజుల్లోగా పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.