News October 15, 2024

భారీ వర్షాలు.. హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు

image

AP: రాయలసీమ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తిరుపతి-0877-2236007, గూడూరు-8624252807, సూళ్లూరుపేట-8623295345, తిరుపతి RDO-7032157040, శ్రీకాళహస్తి-9966524952 నంబర్లను అందుబాటులో ఉంచారు. అటు పలు జిల్లాల్లో పునరావాస కేంద్రాలను ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేస్తున్నారు.

Similar News

News December 26, 2025

BHELలో అప్రెంటిస్ పోస్టులు

image

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(<>BHEL)<<>> హరిద్వార్ 50 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. B,Tech, BE, డిప్లొమా అర్హతగల వారు JAN 14 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.12,900, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.10,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: hwr.bhel.com

News December 26, 2025

ఫెలోపియన్‌ ట్యూబ్స్‌ పని చేయకపోవడానికి కారణాలు

image

ఫెలోపియన్ ట్యూబ్స్‌‌లో సమస్యలు చాలా తక్కువమందిలో కనిపిస్తాయంటున్నారు నిపుణులు. ఇన్‌ఫెక్షన్లు కలగడం, ట్యూబ్ దెబ్బతినడం లేదా తొలగిపోవడం వల్ల, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల శాశ్వతంగా ఫెలోపియన్ ట్యూబ్‌ దెబ్బతినడం లేదా ఆ ట్యూబ్‌ని తీసివేయడం, పుట్టుకతోనే ఫెలోపియన్ ట్యూబ్‌ అసాధారణ రీతిలో అభివృద్ధి చెందడం, ఎండోమెట్రియోసిస్ సమస్య వల్ల ఫాలోపియన్ ట్యూబ్స్ పనిచేయకపోవచ్చంటున్నారు.

News December 26, 2025

తిరుమలలో రద్దీ.. దర్శనానికి 24 గంటలు

image

AP: వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టికెట్లు లేనివారికి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శిలా తోరణం వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. కొండపై రూమ్స్ దొరకడం కష్టంగా మారింది. నిన్న 72వేల మంది భక్తులు వేంకన్నస్వామిని దర్శించుకున్నారు. హుండీకి రూ.4.12 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. కాగా డిసెంబర్ 28 వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.