News October 16, 2024

ఆ తల్లి సంఘీభావం నాకు ధైర్యాన్నిచ్చింది: పవన్ కళ్యాణ్

image

2022, అక్టోబరు 15న జనసేన చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయం నమోదైందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్విటర్‌లో అన్నారు. ‘అన్యాయానికి అడ్డుగా నిలబడేందుకు వీర మహిళలు, జనసైనికులు చూపిన సంకల్పబలం రాష్ట్రం మొత్తం చూసింది. నాకు సంఘీభావంగా ఓ తల్లి తన మూడేళ్ల బిడ్డతో అర్ధరాత్రి సమయంలో అక్కడ కూర్చుని తెలిపిన మద్దతు, దుర్మార్గపు పాలనపై పోరాడేందుకు నాకు తిరుగులేని ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చింది’ అని ట్వీట్ చేశారు.

Similar News

News January 27, 2026

ఇంటర్వ్యూతో ESIC ఫరీదాబాద్‌లో 50 పోస్టులు

image

<>ESIC<<>> మెడికల్ హాస్పిటల్, ఫరీదాబాద్‌ 50 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 28న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS+ MD/MS/MCh/DM/DrNB/FNB అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు జీతం రూ.1,48,669 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, మహిళలు, PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in

News January 27, 2026

ఒకే రోజు రూ.63 కోట్ల కలెక్షన్లు

image

సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘బార్డర్-2’ భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. నిన్న ఒక్క రోజే ఈ మూవీకి రూ.63 కోట్ల కలెక్షన్లు వచ్చాయని మేకర్స్ తెలిపారు. మొత్తంగా నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.193.48 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిందని పేర్కొన్నారు. అనురాగ్ సింగ్ తెరకెక్కించిన ఈ మూవీలో వరుణ్ ధవన్, దిల్జీత్ దోసాంజ్ కీలక పాత్రలు పోషించారు.

News January 27, 2026

మోదీ ట్వీట్.. వివాదాస్పదంగా అనువదించిన గ్రోక్

image

మాల్దీవ్స్‌కు థాంక్స్ చెబుతూ PM మోదీ చేసిన ట్వీట్‌ను <<18752905>>‘గ్రోక్’<<>> తప్పుగా అనువదించింది. ‘రిపబ్లిక్ డే వేడుకలు మాల్దీవ్స్‌లో జరిగాయి. ఈ సుకురియా ప్రభుత్వం భారత వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటోంది. భారత వ్యతిరేక ప్రచారాల్లో ముందుంది’ అన్నట్లు ట్రాన్స్‌లేట్ చేసింది. నిజానికి మోదీ 2 దేశాల ప్రయోజనాల కోసం కలిసి పని చేద్దామని, మాల్దీవుల ప్రజలందరికీ శ్రేయస్సు, ఆనందంతో నిండిన భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.