News October 16, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* TG: దామగుండంలో రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం రేవంత్
* గురుకులాలను వెంటనే తెరవకపోతే చట్టపరమైన చర్యలు: మంత్రి పొన్నం
* గ్రూప్-1 పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు
* ఏపీ జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రుల ప్రకటన
* కూటమి ప్రభుత్వం మూడేళ్లే ఉంటుంది: కాకాణి
* వయనాడ్ ఉపఎన్నిక బరిలో ప్రియాంక: AICC
* మహారాష్ట్రలో నవంబర్ 20న, ఝార్ఖండ్‌లో NOV 13, 20వ తేదీల్లో పోలింగ్

Similar News

News November 5, 2025

GET READY: మరికాసేపట్లో..

image

మరికొన్ని నిమిషాల్లో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. సరిగ్గా సా.6.49 గంటలకు చంద్రుడు భూమికి అతి సమీపంగా వచ్చి కనువిందు చేయనున్నాడు. సాధారణ రోజులతో పోలిస్తే భూమికి దగ్గరగా చంద్రుడు రావడంతో 14% పెద్దగా, 30% అధిక కాంతితో దర్శనమిస్తాడు. దీన్ని బీవర్ సూపర్ మూన్‌గా పిలుస్తారు. ఎలాంటి పరికరాలు లేకుండా ఈ దృశ్యాన్ని వీక్షించడానికి సిద్ధంగా ఉండండి.

News November 5, 2025

ఓటేసేందుకు వెళ్తున్న బిహారీలు.. ఆగిన నిర్మాణ పనులు

image

దేశంలోని చాలా ప్రాంతాల్లో నిర్మాణం, హోటల్స్ సహా అనేక రంగాల్లో లక్షలాది మంది బిహార్ వలస కార్మికులు పనిచేస్తున్నారు. ఈనెల 6, 11 తేదీల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వారంతా స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో ఆయా రంగాలపై ప్రభావం పడుతోంది. దాదాపు 8 లక్షల మంది బిహార్ కార్మికులు హైదరాబాద్‌లో ఉంటున్నట్లు అంచనా. వీరంతా వచ్చే వరకు 10 రోజులు పనులకు ఇబ్బంది తప్పదని నిర్మాణ పరిశ్రమ తెలిపింది.

News November 5, 2025

ఇతిహాసాలు క్విజ్ – 57 సమాధానాలు

image

1. శబరి రాముడి కోసం ‘మాతంగి రుషి’ ఆశ్రమంలో ఎదురు చూసింది.
2. విశ్వామిత్రుడి శిష్యులలో శతానందుడు ‘గౌతముడి’ పుత్రుడు.
3. కుబేరుడు రాజధాని నగరం పేరు ‘అలక’.
4. నారదుడు ‘వీణ’ వాయిద్యంతో ప్రసిద్ధి చెందాడు.
5. కాలానికి అధిపతి ‘యముడు’. కొన్ని సందర్భాల్లో కాళిదేవి, కాళుడు అని కూడా చెబుతారు.
<<-se>>#Ithihasaluquiz<<>>