News October 16, 2024

మహారాష్ట్రలో బుధవారమే పోలింగ్.. ఎందుకంటే?

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 20న బుధవారం పోలింగ్ జరగనుంది. కాగా బుధవారమే పోలింగ్ జరపడం వెనుక పెద్ద కారణమే ఉందని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ‘పోలింగ్ కోసం మేం కావాలనే ఆ రోజును ఎంచుకున్నాం. వారం మధ్యలో బుధవారం పోలింగ్ పెడితే పట్టణ ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుంటారు. అదే వీకెండ్‌లో పెడితే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు’ అని ఆయన చెప్పారు.

Similar News

News January 1, 2026

అనుకున్న సమయానికి అమరావతి పూర్తి చేస్తాం: నారాయణ

image

AP: అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అనుకున్న సమయానికే రాజధానిని పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. మూడేళ్లలో పూర్తిస్థాయిలో అమరావతి రూపుదిద్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే CM చంద్రబాబు అనేక పెట్టుబడులను తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

News January 1, 2026

గుండెలు పగిలే బాధ.. ఈ తల్లి శోకాన్ని తీర్చేదెవరు?

image

ఇండోర్ (MP)లో <<18729199>>కలుషిత నీరు<<>> తాగి చనిపోయిన వారిలో 6 నెలల పసికందు కూడా ఉండటం హృదయాలను కలచివేస్తోంది. తల్లి సాధన మున్సిపల్ కుళాయి నీటిని పాలలో కలిపి బిడ్డకు తాగించింది. వాంతులు చేసుకున్న కుమారుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పదేళ్ల ప్రార్థనల తర్వాత సంతానం కలిగిందని, పెద్ద కూతురు (10) కడుపునొప్పితో బాధపడుతోందని ఆ తల్లి గుండెలు బాదుకుంది.

News January 1, 2026

డెలివరీ అయ్యాక బెల్ట్ వాడుతున్నారా?

image

డెలివరీ అయ్యాక కండరాల పటుత్వం కోసం, పొట్ట పెరగకుండా ఉండేందుకు చాలా మంది మహిళలు Abdominal Belt వాడుతుంటారు. నార్మల్ డెలివరీ అయితే 1-2 రోజులకు, సిజేరియన్ అయితే డాక్టర్ సూచనతో 7-10 రోజులకు మొదలుపెట్టొచ్చని గైనకాలజిస్టులు చెబుతున్నారు. రోజుకు 2-8 గంటలు, మూడు నెలల పాటు వాడితే సరిపోతుందంటున్నారు. తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు బెల్ట్ వాడకూడదని చెబుతున్నారు.