News October 16, 2024

కమిన్స్‌ను SRH వదిలేస్తుంది: ఆకాశ్ చోప్రా

image

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్‌ను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పారు. అతడిపై రూ.18 కోట్లు వెచ్చించేందుకు ఆ జట్టు సిద్ధంగా లేదని చెప్పారు. ‘కమిన్స్‌తోపాటు మార్క్‌రమ్, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్‌ను కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డిని మాత్రం కచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

Similar News

News February 6, 2026

‘ఢిల్లీని షేక్ చేస్తాం’.. లష్కరే టెర్రరిస్టు ప్రేలాపనలు

image

ఇండియాలోని ప్రధాన సిటీల్లో దాడులు చేస్తామంటూ లష్కరే తోయిబా (LeT) టెర్రరిస్టు సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ నఖ్వీ హెచ్చరించాడు. ‘అఖండ భారత్‌ను ఖండఖండాలుగా చేస్తాం. ఆగ్రాకు నిప్పు పెడతాం. దక్కన్‌ను మండిస్తాం. ఢిల్లీని షేక్ చేస్తాం’ అని లాహోర్‌లో ప్రేలాపనలు చేశాడు. కశ్మీర్‌కు విముక్తి కల్పిస్తామని చెప్పాడు. భారత్‌కు వ్యతిరేకంగా పాక్ ఏటా ఫిబ్రవరి 5న <<19062687>>కశ్మీర్ సంఘీభావ దినోత్సవాన్ని<<>> నిర్వహిస్తోంది.

News February 6, 2026

బంధాలకు మిడ్‌లైఫ్‌ క్రైసిస్‌ ముప్పు

image

40ఏళ్ల తర్వాత చాలామందిని మిడ్ లైఫ్ క్రైసిస్ చుట్టుముడతాయి. పెళ్లి, పిల్లలు, వారి చదువుల తర్వాత దంపతుల్లో మిడ్ లైఫ్ క్రైసిస్ వస్తున్నాయి. కొన్నిసార్లు ఇవి వ్యక్తిగతంగా బాధిస్తుంటే, కొన్నిసార్లు బంధాలపై ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే కెరీర్‌ను, కుటుంబాన్ని, ఇష్టాలను బ్యాలెన్స్‌ చేసుకోవాలంటున్నారు. ముందునుంచీ మనసు ఏం కోరుకుంటుందో దానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.

News February 6, 2026

FLASH: పెరిగిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర గంటల వ్యవధిలోనే పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఉదయంతో పోల్చితే రూ.1,360 పెరిగి రూ.1,53,710కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,250 ఎగబాకి రూ.1,40,900 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,80,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.