News October 16, 2024

శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

image

శబరిమల వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోని భక్తులు కూడా అయ్యప్పను దర్శనం చేసుకోవచ్చని పినరయి విజయన్ సర్కార్ ప్రకటించింది. వర్చువల్ బుకింగ్‌పై విపక్షాలు, భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో విజయన్ దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేశారు. రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా వచ్చిన వారికి కూడా దర్శన సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Similar News

News February 3, 2026

రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే..

image

రోజూ రాత్రి నిద్రపోయే ముందు ఓ లవంగం మొగ్గను నమిలితే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు. ఒత్తిడి తగ్గి మంచి నిద్ర వస్తుందని పేర్కొంటున్నారు. అలాగే రాత్రి భోజనానికి అరగంట ముందు గోరు వెచ్చని నీరు తాగితే ఆహారం సులభంగా అరుగుతుందని చెబుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ టీ, కాఫీ లాంటివి తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

News February 3, 2026

జల్‌జీవన్ మిషన్‌ నిధులు నిలిపివేత

image

జల్‌జీవన్ మిషన్లో మిగిలిన పనులకు నిధులు నిలిపివేస్తున్నట్లు కేంద్రం రాజ్యసభలో ప్రకటించింది. 2019లో చేపట్టిన ఈ స్కీమ్‌లో ₹2.08 ల‌క్ష‌ల CR 2024-25కే ఖర్చయి 81.5% పనులే పూర్తయ్యాయి. పలు రాష్ట్రాల్లో అక్రమాలు గుర్తించిన కేంద్రం మిగతా పనులకు నిధులు రాష్ట్రాలే భరించాలని స్పష్టం చేసింది. FY26-27కు కేటాయించిన ₹67,670 CR నిర్వహణకు ఇవ్వనుంది. కాగా APలో రూ.23వేల కోట్ల పనులకు ఇటీవలే కేంద్రం ఆమోదం తెలిపింది.

News February 3, 2026

13న ఓటీటీలోకి రవితేజ సినిమా?

image

రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయినట్లు సమాచారం. ఈ నెల 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ట్రయాంగిల్ లవ్&కామెడీ డ్రామాతో రూపొందిన ఈ చిత్రంలో డింపుల్ హయాతి, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది.