News October 16, 2024

అద్భుతం: కలలోనూ సమాచార మార్పిడి!

image

కలగంటున్న ఇద్దరు వ్యక్తులకు సమాచారాన్ని పంపడంలో కాలిఫోర్నియా సైంటిస్టులు విజయం సాధించారు. ‘డెయిలీ మెయిల్’ కథనం ప్రకారం.. నిద్రపోవడానికి ముందు ఇద్దరు అభ్యర్థులకు బ్రెయిన్‌ను పర్యవేక్షించే పరికరాల్ని పరిశోధకులు అమర్చారు. యంత్రం ద్వారా ఓ పదాన్ని వారికి పంపించగా, నిద్రలోనే పైకి పలికారని వివరించారు. ఇది మానసిక అనారోగ్యాల చికిత్సలో మున్ముందు కీలకంగా మారొచ్చని సైంటిస్టులు పేర్కొన్నారు.

Similar News

News October 16, 2024

48 గంటల్లో 11 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్

image

బెంగళూరు ఆకాశ ఎయిర్ విమానానికి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ముందు జాగ్రత్తగా దానిని ఢిల్లీకి మళ్లించారు. గత 48 గంటల్లో ఇలా నకిలీ బెదిరింపు కాల్స్ రావడం ఇది 11వ సారి. మంగళవారం 8, సోమవారం 2 వచ్చాయి. ఈ అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, DGCA అధికారులు వేర్వేరుగా సమావేశమయ్యారు. డార్క్‌వెబ్ ద్వారా ఈ కాల్స్ వస్తున్నాయని, కొందరు దోషుల్ని గుర్తించారని తెలిసింది.

News October 16, 2024

అన్నక్యాంటీన్ల రంగులపై హైకోర్టులో విచారణ

image

AP: అన్నక్యాంటీన్లకు TDP రంగులు వేస్తున్నారని దాఖలైన పిటిషన్‌‌‌పై హైకోర్టు విచారించింది. గతంలో సచివాలయాలకు బ్లూ కలర్ వేయడంతో వాటిని తొలగించాలని ఇచ్చిన తీర్పును పిటిషనర్ తరఫు లాయర్ కోర్టుకి తెలిపారు. రంగులు తొలగించడానికి సమయం పట్టడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ సైతం దాఖలైందన్నారు. గతంలో క్యాంటీన్లకు ఏ కలర్ వేశారని కోర్టు ప్రశ్నించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి, విచారణను 6వారాలకు వాయిదా వేసింది.

News October 16, 2024

INDvsNZ: తొలి టెస్టు తొలిరోజు ఆట రద్దు

image

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టులో తొలిరోజు ఆట రద్దయింది. అక్కడ భారీ వర్షం కురుస్తుండడంతో ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. వర్షం మళ్లీ రాకపోతే రేపు ఉ.8.45కి టాస్ వేసి 9.15గంటలకు మ్యాచ్ ప్రారంభిస్తారు.