News October 16, 2024

సిద్దిపేట: మౌంట్ పాతల్స్ అధిరోహించిన విహాన్ రామ్

image

హిమాచల్ ప్రదేశ్‌లోని మౌంట్ పాతల్స్ పర్వతాన్ని (4,250mtrs)& (14,600 feets) సిద్దిపేట జిల్లా హనుమతండాకు చెందిన బాలుడు జాటోత్ విహాన్ రామ్ అధిరోహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “Say No To Drugs”అనే నినాదం పట్ల యువతకు అవగాహన కల్పించడానికి పర్వతాన్ని అధిరోహించినట్లు విహాన్ రామ్ తెలిపారు. అతి పిన్న వయస్సులో విహాన్ రామ్(8) ప్రతికూల వాతావరణంలో అధిరోహించాడు.

Similar News

News January 17, 2026

మెదక్: మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు: కలెక్టర్

image

మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీల వార్డు రిజర్వేషన్లను రాజకీయ పార్టీల సమక్షంలో పారదర్శకంగా ఖరారు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్‌లో 32, తూప్రాన్‌లో 16, నర్సాపూర్‌లో 15, రామాయంపేటలో 12 వార్డులకు రిజర్వేషన్లు కేటాయించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

News January 17, 2026

మెదక్: ప్రాణరక్షణకు హెల్మెట్ తప్పనిసరి: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు హెల్మెట్ ధరించడం అత్యంత కీలకమని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను కేవలం నిబంధనగా కాకుండా, వ్యక్తిగత భద్రతగా భావించాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆయన హెచ్చరించారు.

News January 17, 2026

మెదక్ మున్సిపాలిటీలు.. మహిళలకే పట్టం!

image

మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మహిళా గర్జన వినిపించనుంది. ఛైర్‌పర్సన్ పీఠాలన్నీ మహిళలకే రిజర్వు కావడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. మెదక్ స్థానం బీసీ మహిళకు దక్కగా.. తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ స్థానాలు జనరల్ మహిళలకు కేటాయించారు. దీంతో ఆశావహుల సందడి మొదలైంది. వార్డుల వారీగా రిజర్వేషన్లను కూడా అధికారులు అధికారికంగా ప్రకటించారు.