News October 16, 2024

కెప్టెన్సీ నుంచి హర్మన్‌ప్రీత్ ఔట్?

image

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి హర్మన్‌ప్రీత్ కౌర్‌ను తప్పించాలని BCCI యోచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో హెడ్ కోచ్ అమోల్ మజుందార్‌తో బీసీసీఐ సమావేశం కానుందని, అప్పుడే కెప్టెన్సీపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. స్వదేశంలో జరిగే వన్డే WC 2025ను దృష్టిలో ఉంచుకుని జట్టుకు కొత్త కెప్టెన్‌ను నియమిస్తారని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.

Similar News

News February 2, 2026

విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 4, 6, 6, 6, 4, 6

image

వరల్డ్ లెజెండ్స్ ప్రొ T20 లీగ్‌లో అభిమన్యు మిథున్(రాజస్థాన్ లయన్స్) విధ్వంసం సృష్టించారు. పవన్ నేగీ(ఢిల్లీ వారియర్స్‌) వేసిన 20వ ఓవర్‌లో వరుసగా 4, 6, 6, 6, 4, 6 బాదారు. 7 బంతుల్లో 33 రన్స్(471.43 స్ట్రైక్ రేటు) చేశారు. మరో ప్లేయర్ మోర్గాన్ 87 రన్స్(10 సిక్సులు, 1 ఫోర్) బాదడంతో రాజస్థాన్ 185-7 స్కోర్ చేసింది. ఛేజింగ్‌లో ఢిల్లీ 162 పరుగులకే ఆలౌటైంది.

News February 2, 2026

కాంగ్రెస్ ప్రభుత్వ పెట్టుబడులన్నీ కట్టుకథలే: కవిత

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న పెట్టుబడులన్నీ కట్టు కథలేనని జాగృతి చీఫ్ కవిత విమర్శించారు. ‘సింగపూర్ గేట్‌వే సంస్థకు వెబ్సైటూ లేదు. ₹70వేల CR పెట్టుబడి అన్న ఇన్ఫ్రా కీ డేటా సెంటర్ పార్క్ కంపెనీ USలో ₹90వేల CR, బ్రెజిల్‌లో ₹70వేల CRకు MOU చేసింది. గతేడాదే ఏర్పాటైన ఇది MOUల కోసమే పుట్టినట్లుంది. జయవీర్ రెడ్డి కంపెనీ నిజమైనదో కాదో చెప్పాలి. ₹10L లేని కంపెనీలు ₹వేలకోట్ల MOUలు చేశాయి’ అని అన్నారు.

News February 2, 2026

Budget: గోల్డ్ బాండ్స్ ఇకపై ట్యాక్స్ ఫ్రీ కాదా?

image

బడ్జెట్‌లో గోల్డ్ బాండ్ల పన్ను మినహాయింపును కుదించారు. ఇకపై RBI ఈ బాండ్లను ఇష్యూ చేసినప్పుడే నేరుగా కొని మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటేనే పన్ను ఉండదు. ఒకవేళ స్టాక్ మార్కెట్‌లో ఇతరుల దగ్గర కొనుగోలు చేస్తే మెచ్యూరిటీ సమయంలో వచ్చే లాభంపై కచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే. అలాగే మెచ్యూరిటీ కంటే ముందు అమ్మినా పన్ను తప్పదు. అయితే ఏటా వచ్చే 2.5% వడ్డీపై పాత పద్ధతిలోనే పన్ను వర్తిస్తుంది.