News October 16, 2024
వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కూర్మనాథ్
బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన తుఫాను గంటకు 10 కి.మీ వేగంతో వాయవ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం చెన్నైకి 440, పుదుచ్చేరికి 460, నెల్లూరుకి 530 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం రేపు తెల్లవారుజామున పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ఎండి రోణంకి కుర్మానాథ్ తెలిపారు.
Similar News
News December 22, 2024
నెల్లూరు: వైభవంగా లక్ష్మి నరసింహ స్వామి పల్లకి సేవ
నెల్లూరు కలకొండ కొండపై గల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో స్వామివారికి శనివారం పల్లకి సేవ వైభవంగా జరిగింది. స్వామివారు ఆదిలక్ష్మి, చెంచు లక్ష్మి సమేతుడై పల్లకిలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. నరసింహ నామ స్మరణతో దేవాలయం మారుమోగింది. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
News December 21, 2024
నాయుడుపేట: నదిలో కొట్టుకొచ్చిన అస్థిపంజరం
నాయుడుపేటలో అస్థిపంజరం కలకలం రేపింది. స్వర్ణముఖి నదిలో కొట్టుకొచ్చిన మనిషి అస్తిపంజరాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 21, 2024
నెల్లూరు: బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడి
బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన వ్యక్తికి శిక్ష పడింది. బాలాయపల్లిలోని ఓ బాలికను జయంపులో దుకాణం నడుపుతున్న ఓజిలి(M) ఇనుగుంటకు చెందిన సుబ్బారావు ప్రేమ పేరుతో నమ్మించాడు. సుబ్రహ్మణ్యం, వెంటకయ్య, వాణి సహయంతో 2015లో బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. నేరం రుజువు కావడంతో నలుగురికి పదేళ్ల జైలు, రూ.22వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ నిన్న తీర్పుచెప్పారు.