News October 16, 2024

నేడు J&K సీఎంగా ఒమర్ ప్రమాణస్వీకారం

image

జమ్మూకశ్మీర్ సీఎంగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు శ్రీనగర్‌లోని ఎస్కేఐసీసీలో ఆయనతో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇతర కూటమి సభ్యులు హాజరుకానున్నారు. మరోవైపు హరియాణా సీఎం అభ్యర్థిని బీజేపీ నేడో రేపో ప్రకటించే అవకాశం ఉంది.

Similar News

News January 12, 2026

శాస్త్రం చూసి మరీ కోడి పందేలు.. ఎందుకంటే?

image

గోదావరి జిల్లాల్లో కోడి పందేలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ పందెంలో గెలవడానికి పుంజుకి సత్తా ఉంటే సరిపోదట, గ్రహాలు కూడా అనుకూలించాలట. ఈ విషయాలు తెలుసుకోవడానికి ఓ గ్రంథమే అందుబాటులో ఉంది. అదే ‘కుక్కుట శాస్త్రం’. పందెం రాయుళ్లు కోడి పందేల సమయంలో ఈ గ్రంథంపైనే ఆధారపడతారట. అసలు ఈ గ్రంథంలో ఏముంటుంది? పందెం కోళ్ల విజయాలపై ఈ గ్రంథం ఏం చెబుతుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

News January 12, 2026

DRDO-SSPLలో ఇంటర్న్‌షిప్‌.. అప్లై చేశారా?

image

<>DRDO<<>>కు చెందిన సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబోరేటరీ(SSPL)లో 52 పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లకు అప్లై చేయడానికి ఎల్లుండే లాస్ట్ డేట్. BE/BTech లేదా ME/MTech చదువుతున్నవారు ఫిజిక్స్/కెమిస్ట్రీ/ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ మెటీరియల్ సైన్స్/ క్వాంటమ్ టెక్నాలజీ/ లేజర్ ఆప్టిక్స్/ సెమీకండక్టర్ డివైజ్/IT/ CSE స్ట్రీమ్‌లో ఇంటర్న్‌షిప్‌ చేయవచ్చు. ఎంపికైనవారికి నెలకు రూ.5000 స్టైపెండ్ చెల్లిస్తారు. www.drdo.gov.in

News January 12, 2026

కుక్కుట శాస్త్రంలో ఏముంటుంది?

image

మనకు పంచాంగం ఉన్నట్టే కోళ్లకూ ఉంది. కోడిని సంస్కృతంలో ‘కుక్కుట’ అంటారు. వీటి పంచాంగానికి ‘కుక్కుట శాస్త్రం’ అని పేరు. దీని ప్రకారం తిథి, వార, నక్షత్రాలు.. కోళ్ల గెలుపు, ఓటములపై ప్రభావం చూపుతాయని పందెం రాయుళ్లు నమ్ముతారు. కుక్కుట శాస్త్రంలో 27 నక్షత్రాలుంటాయి. ఇవి కోడిపుంజుల రకాలను బట్టి ప్రభావం చూపుతాయట. ఏ వారంలో ఏ కోడి గెలుస్తుంది? ఏ ఘడియ, ఏ నక్షత్రంలో దానిని బరిలో దింపాలనేది ఈ శాస్త్రంలో ఉందట.