News October 16, 2024

బాలయ్య-బోయపాటి కొత్త సినిమా టైటిల్ ఇదే..

image

బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త చిత్రం టైటిల్‌ను అనౌన్స్ చేశారు. బ్లాక్‌బస్టర్ హిట్ ‘అఖండ’కు సీక్వెల్‌గా ‘అఖండ-2 తాండవం’ రానున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ట్వీట్ చేసింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని పేర్కొంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించనుండగా బాలకృష్ణ కూతురు తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరించనున్నారు.

Similar News

News February 3, 2026

మెదక్: మాజీ నక్సలైట్‌ అని బెదిరించి డబ్బులు వసూలు

image

మాజీ నక్సలైట్‌నని బెదిరిస్తూ సర్పంచ్‌ ఆకుల సుజాత మల్లేశం గౌడ్, ఉప సర్పంచ్‌ యెన్నం రాజేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన కుర్మ శ్యామ్ కుమార్ అలియాస్ సాంబమూర్తిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి మండల కేంద్రంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సర్పంచ్‌ భర్త, ఉప సర్పంచ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సృజన తెలిపారు.

News February 3, 2026

శుభ సమయం (03-2-2026) మంగళవారం

image

➤ తిథి: బహుళ విదియ రా.02.06 వరకు తదుపరి తదియ ➤ నక్షత్రం: ముఖ రా.11.47 వరకు ➤ శుభ సమయాలు: ఉ.8.25-8.47 వరకు, ఉ.9.34-ఉ.11.15 వరకు తిరిగి మ.3.00 నుంచి సా.5.49 వరకు ➤ రాహుకాలం: ప.03.00- 4.30 వరకు ➤ యమగండం: ఉ.9.00-ఉ.10.30 వరకు ➤ దుర్ముహూర్తం: ఉ.8.48-ఉ.9.33 వరకు తిరిగి రా.10.55 నుంచి 11.45 వరకు ➤ వర్జ్యం: ఉ.11.55-మ.1.30 వరకు ➤ అమృత ఘడియలు: రా.9.25 నుంచి రా.11.00 వరకు

News February 3, 2026

ప్రపంచ శాంతి, శ్రేయస్సుకు ట్రంప్ నాయకత్వం కీలకం: మోదీ

image

ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు ట్రంప్ నాయకత్వం కీలకమని ప్రధాని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. “మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై సుంకాలను 18 శాతానికి తగ్గించడం అద్భుత నిర్ణయం. భారత్, అమెరికా సహకారం రెండు దేశాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరం. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రంప్‌తో కలసి పనిచేయాలని ఆశిస్తున్నా. ప్రపంచంలో రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తున్నాయి” అని మోదీ ట్వీట్ చేశారు.