News October 16, 2024
సంతబొమ్మాళి ఘటనలో తల్లి మృతి

సంతబొమ్మాలి మండలం కుమందానివానిపేట గ్రామంలో ఇద్దరు చిన్నారులకు తల్లి విషమిచ్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తల్లి దుర్గ సైతం చికిత్స పొందుతూ బుధవారం వేకువజామున 3 గంటలకు మృతిచెందినట్లు టెక్కలి జిల్లా ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు. చిన్నారుల మృతి అనంతరం ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చేర్చగా చనిపోయింది.
Similar News
News December 24, 2025
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి: మంత్రి అచ్చెన్న

అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి కింజరాపు అచ్చెన్న అధికారులను ఆదేశించారు. కోటబొమ్మాళి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో బుధవారం గ్రీవెన్స్ నిర్వహించారు. గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదుదారుడు చేసిన అంశాలను జాగ్రత్తగా పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
News December 24, 2025
రణస్థలం: మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్న ఘటన రణస్థలంలోని పైడిభీమవరంలో చోటుచేసుకుంది. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల మేరకు సీహెచ్ పురుషోత్తం ఆచారి (52) విరేచనాల మందు, సెంటు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. కొంతకాలంగా గుండె వ్యాధితో బాధపడి, మనస్తాపానికి గురయ్యాడన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News December 24, 2025
ఈ నెల 26న మీ చేతికి మీ భూమి: మంత్రి

మీ చేతికి మీ భూమి 22 ఏ భూస్వేచ్ఛ పేరుతో ప్రత్యేక డ్రైవ్ ను ఈ నెల 26న శ్రీకాకుళంలోని జడ్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో జడ్పీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిషేధిత భూముల విషయమై ఎవ్వరైనా విజ్ఞాపనలు చేసుకోవచ్చన్నారు. సంబంధిత అర్జీలను రెవెన్యూ అధికారులు పరిశీలించి, న్యాయం చేస్తారన్నారు.


