News October 16, 2024

పెరగనున్న మందుల ధరలు

image

టీబీ, ఆస్తమా, గ్లాకోమా, తలసేమియా, మెంటల్ హెల్త్‌కు సంబంధించిన మెడిసిన్ ధరలను 50 శాతం పెంచేందుకు ఎన్‌పీపీఏ ఆమోదం తెలిపింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగాయనే ఫార్మాస్యూటికల్ కంపెనీల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకుంది. బెంజిపెన్సిలిన్‌, ఆట్రోపైన్‌, స్ట్రెప్టోమైసిన్‌, సాల్బుటమాల్‌, పిలోకార్పైన్‌, సెఫడ్రాక్సిల్‌, డెస్ఫెర్రొగ్జామైన్‌, లిథియం మందులు ఈ జాబితాలో ఉన్నాయి.

Similar News

News January 5, 2026

US వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు

image

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు జరగడం సంచలనంగా మారింది. ఒహియోలోని ఇంటిపై ఓ దుండగుడు కాల్పులు జరపడంతో అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఫైరింగ్ సమయంలో వాన్స్ ఇంట్లో లేరని అధికారులు వెల్లడించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 5, 2026

మహిళలూ 35ఏళ్లు దాటాయా?

image

35ఏళ్లు దాటిన తర్వాత మహిళల ఎముకల సాంద్రత తగ్గుతూ, ఎముకలు గుల్లబారడం మొదలవుతుంది. ఇదే ఆస్టియొపొరోసిస్‌. ఇలా కాకుండా ఉండాలంటే 35 ఏళ్ల వరకూ ప్రతిరోజూ పావు లీటరు పాలు, పాల ఉత్పత్తులు తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మెనోపాజ్‌ వరకూ ఎముకల అరుగుదలను నియంత్రించవచ్చు. ఆ తర్వాత క్యాల్షియం సప్లిమెంట్ల అవసరం రావొచ్చు. అప్పుడు కూడా సొంతంగా సప్లిమెంట్లు కొనేసి వాడేయకుండా, వైద్యుల సూచనలను పాటించాలి.

News January 5, 2026

మిగిలింది 17 మంది మావోయిస్టులే.. పోలీసుల రిపోర్ట్

image

TG: 17 మంది కీలక మావోయిస్టు నేతలు మాత్రమే రాష్ట్రంలో మిగిలి ఉన్నట్టు కేంద్రానికి పంపిన రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. వారు కూడా లొంగిపోతే మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ మారుతుందన్నారు. అజ్ఞాతంలో ఉన్న వారిలో ముప్పాల లక్ష్మణ్ రావు (గణపతి), తిప్పిరి తిరుపతి (దేవ్ జీ), మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్), పసునూరి నరహరి (సంతోష్) సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు. అందరిపైనా రూ.2కోట్ల 25లక్షల రివార్డు ఉంది.