News October 16, 2024
‘విశ్వంభర’కు వినాయక్ సాయం!

దర్శకుడు వి.వి.వినాయక్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘విశ్వంభర’కు సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ విషయంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్. కాగా చిరంజీవి, వినాయక్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఠాగూర్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
Similar News
News January 15, 2026
ఎయిర్‌ఫోర్స్ స్కూల్ హిండెన్‌లో ఉద్యోగాలు

ఘజియాబాద్‌లోని <
News January 15, 2026
మనోళ్లదే డామినేషన్.. ఆధార్ కార్డు vs గ్రీన్ కార్డు!

అండర్-19 WCలో INDతో ఆడుతున్న అమెరికా జట్టులోని ప్లేయర్లందరూ భారత మూలాలు ఉన్నవారే కావడం విశేషం. ఉత్కర్ష్ శ్రీవాస్తవ(C), అద్నిత్, నితీశ్, అర్జున్ మహేశ్, అమరీందర్, సబ్రిశ్, అదిత్, అమోఘ్, సాహిల్, రిషబ్, రిత్విక్ పూర్వీకులు ఇండియా నుంచి వెళ్లారు. దీంతో మనోళ్ల డామినేషన్ మామూలుగా లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది IND vs USA కాదని.. ఆధార్ కార్డు vs గ్రీన్ కార్డు అని జోకులు పేలుస్తున్నారు.
News January 15, 2026
ఈ ఫేస్ ప్యాక్‌తో ఎన్నో లాభాలు

పెరుగు, శనగపిండి, పసుపు మూడు కలిసి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నాయి. వీటిని కలిపి ప్యాక్‌లా తయారుచేసుకుని ముఖానికి, చర్మానికి పట్టించడం వల్ల సౌందర్యం పెరుగుతుంది. చర్మంపై చేరే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. చర్మంపై ముడతలు, మచ్చలు రాకుండా ఉంటాయి. కెమికల్ క్రీములు వాడే బదులు వీటిని వాడటం వల్ల చర్మ సౌందర్యాన్ని సులువుగా పెంచుకోవచ్చని చెబుతున్నారు.


