News October 16, 2024
ప్రకాశం: ‘ప్రతి సబ్ డివిజన్ పరిధిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు’

ప్రకాశం జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రతి సబ్ డివిజన్ పరిధిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ.. రాబోయే 2 రోజులు భారీ వర్షాలు ఉన్న కారణంగా ప్రయాణ సమయంలో వానదారులు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. తక్షణ సహాయం కొరకు 9121102266 , 100, 112 నెంబర్లను సంప్రదించాలన్నారు.
Similar News
News September 15, 2025
ప్రకాశంలో ఇంజినీర్ల అద్భుతానికి నిదర్శనం ఇదే!

ప్రకాశం జిల్లాలో గిద్దలూరు నుంచి నంద్యాల వరకు 60 కి.మీ రహదారి ఉంది. ఇందులో 25 కి.మీ ప్రయాణం ఘాట్ రోడ్డులో ఉంటుంది. స్వాతంత్ర్యం రాకముందు నిర్మించిన రైల్వే పురాతన వంతెనల దిమ్మెలు నేటికీ కనిపిస్తున్నాయి. నాటి ఇంజినీర్ల ప్రతిభకు ఈ ఘాట్ రోడ్డు అద్భుతమైన నిదర్శనంగా నిలుస్తోంది. ప్రకాశం జిల్లాలో ఇంజినీర్లు సృష్టించిన అద్భుతాలకు ఇదో ఉదాహరణ.
News September 15, 2025
మోక్షగుండం విశ్వేశ్వరయ్య మన జిల్లా వాసే

నేడు ఇంజనీర్స్ డే. దేశమంతా మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్మరిస్తుంది. ఇంజినీర్లందరూ ఆయనే ఆదర్శమని గర్వంగా చెబుతుంటారు. ఆయన జయంతి సందర్భంగానే ఇంజినీర్స్ డేను జరుపుకుంటారు. విశ్వేశ్వరయ్య పూర్వీకులు బి.పేట మండలంలోని మోక్షగుండం వాసులే. ఈయనను మోక్షగుండం ప్రజలు నేటికీ ఆరాధిస్తారు. ముంబై, పూణే, హైదరాబాద్‌లో వంతెనలు నిర్మించి వరదల నుంచి కాపాడిన ఘనత ఈయన సొంతం.
News September 15, 2025
పూర్వ ఎస్పీ దామోదర్‌కు ఘనంగా వీడ్కోలు

ఒంగోలులోని జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం ఎస్పీ దామోదర్‌కు వీడ్కోలు సభను జిల్లా పోలీస్ అధికారులు నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎస్పీ దామోదర్ జిల్లాకు అందించిన సేవలను పలువురు పోలీస్ అధికారులు కొనియాడారు. అనంతరం ఎస్పీ దామోదర్‌ను పోలీస్ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.